Parliament: పార్లమెంట్‌లో గందరగోళం.. 15 మంది ఎంపీల సస్పెన్షన్

సస్పెన్షన్‌ వేటు పడిన వారిలో 14 మంది లోక్‌సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.

lok sabha

Lok Sabha: ‘భద్రతా వైఫల్యం’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంటు వెలుపల, లోక్‌సభలో నిన్న కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గ్యాస్ స్ప్రే చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే. భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించారు విపక్ష పార్టీల ఎంపీలు.

దీంతో మొత్తం 15 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్‌ వేటు పడిన వారిలో 14 మంది లోక్‌సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. లోక్‌సభలో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలు జరగకుండా చేస్తున్నారని శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్​ను సస్పెండ్ చేశాక సభను రేపటికి వాయిదా వేశారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చకు ఎందుకు అవకాశం కల్పించడం లేదని నిలదీశారు. ‘భద్రతా వైఫల్యం’ జరిగినందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాము కోరుతుంటే తమపైనే చర్యలు తీసుకున్నారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి మండిపడ్డారు.

BJP MP Pratap Simha: పార్లమెంట్ చొరబాటుదారులకు పాసులు ఇచ్చిన ఎంపీ ప్రతాస్ సిన్హా ఎవరు? నిన్నటి ఘటనపై ఆయన ఏమన్నారు?