BJP MP Pratap Simha: పార్లమెంట్ చొరబాటుదారులకు పాసులు ఇచ్చిన ఎంపీ ప్రతాస్ సిన్హా ఎవరు? నిన్నటి ఘటనపై ఆయన ఏమన్నారు?
చొరబాటుదారుల గురించి తన వద్ద పెద్దగా సమాచారం లేదని లోక్‌సభ స్పీకర్‌కు ప్రతాప్ సిన్హా తెలిపారు. కానీ వారిలో ఒకరైన మనోరంజన్.. తనకు విజిటర్ పాస్ పొందడానికి సిన్హా పీఏతో నిరంతరం టచ్‌లో ఉండేవాడు

పార్లమెంటుపై దాడి జరిగి నిన్నటికి (డిసెంబర్ 13) 22 ఏళ్లు పూర్తయ్యాయి. పార్లమెంట్‌పై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పార్లమెంట్ భద్రతలో లోపభూయిష్టమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఎంపీల సీట్లపైకి దూకారు. కాసేపు హంగామా సృష్టించారు. అయితే భద్రతా సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. సభా కార్యకలాపాలు వాయిదా పడిన అనంతరం జరిగిన ఘటనపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా 22 సంవత్సరాల తరువాత అదే రకమైన భయాందోళన వాళ్లలో కనిపించింది.
ఇది కూడా చదవండి: యూనివర్సిటీలో బాంబు తయారు చేస్తున్న విద్యార్థి ప్రభాత్.. ఒక్కసారిగా పేలిపోవడంతో..
లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీ నుంచి సాగర్, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు ఎంపీ సీట్లవైపుకు దూకారు. ఈ ఇద్దరు నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి పాస్ పొందారు. ఎంపీ ద్వారా ఒక వ్యక్తికి పాస్ ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి వ్యక్తిగతంగా తమకు తెలుసని అఫిడవిట్ ఇవ్వాలి. పార్లమెంట్‌లోకి చొరబడిన నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌లో బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా పేరు రాసి ఉంది. దీంతో బీజేపీ ఎంపీలు విపక్షాలకు టార్గెట్ అయ్యారు. అయితే ఈ ఘటనపై ప్రతాప్ సిన్హా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. చొరబాటు నిందితుల్లో ఒకరి తండ్రి తన పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందినవారని, ఆయన విజిటర్స్ పాస్ కోసం అడిగారని ఆయన లోక్‌సభ స్పీకర్‌కి ఖచ్చితంగా చెప్పారు.
హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. చొరబాటుదారుల గురించి తన వద్ద పెద్దగా సమాచారం లేదని లోక్‌సభ స్పీకర్‌కు ప్రతాప్ సిన్హా తెలిపారు. కానీ వారిలో ఒకరైన మనోరంజన్.. తనకు విజిటర్ పాస్ పొందడానికి సిన్హా పీఏతో నిరంతరం టచ్‌లో ఉండేవాడు. ప్రతాప్ సిన్హా (47) మైసూరు-కొడగు స్థానం నుంచి లోక్‌సభ ఎంపీ. ఆయన మైసూరులో ప్రముఖ నాయకుడు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. ప్రతాప్ సిన్హా మొదట కన్నడ ప్రభలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా ప్రతాప్ సిన్హా నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ దాడికి ఎలా ప్లాన్ చేశారు? ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందా?
ప్రతాప్ సిన్హా హిందుత్వకు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. కర్నాటకలో టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలను నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఎందుకంటే టిప్పు సుల్తాన్ ఇస్లామిస్టులకు మాత్రమే రోల్ మోడల్ అని వాదన. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన జంతు ప్రేమికుల మీద విరుచుకుపడ్డారు. కుక్కలను ప్రేమించే వారు తమ పిల్లలను కరిచినప్పుడు వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదమేమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు.