woman restrains dog
Woman Restrains Dog : సాధారణంగా మహిళలకు సీమంతం చేస్తుంటారు. కానీ ఇటీవలికాలంలో పెంపుడు జంతువులకు కూడా సీమంతం చేస్తున్నారు. గతంలో కొంతమంది ఆవులు, పిల్లులకు కూడా సీమంతం చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా పెంపుడు కుక్కకు ఓ మహిళ సీమంతం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సుజాత భారతి అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 50 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో సుజాత కుక్కను కొత్త బట్టలతో అలకరించి దానికి పసుపు కుంకుమ దిద్దడం చూడవచ్చు. అలాగే కుక్కకు ఇష్టమైన ఆహార పదార్థాలతో కూడిన ప్లేట్లు కనిపించాయి.
Hair cutting for cat : పిల్లికి హెయిర్ కటింగ్.. మీసాలకు ట్రిమ్మింగ్ .. బుద్దిగా భలే చేయించుకుందిగా
చివరిగా ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను సుజాత వీధి కుక్కలకు పంచడం నెటిజన్లకు ఆకట్టుకుంది. అంతేకాకుండా ‘మా బేబీకి సీమంతం’ అని వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. సుజాత తన పెంపుడు కుక్కపై చూపిన ఆదరణకు పలువురు యూజర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.