Hair cutting for cat : పిల్లికి హెయిర్ కటింగ్.. మీసాలకు ట్రిమ్మింగ్ .. బుద్దిగా భలే చేయించుకుందిగా

Hair cutting for cat : పిల్లికి హెయిర్ కటింగ్.. మీసాలకు ట్రిమ్మింగ్ .. బుద్దిగా భలే చేయించుకుందిగా

Hair cutting for cat

Hair cutting for cat : ‘పనిలేని క్షరకుడు పిల్లి తల గొరిగాడు’ అనేది ఓ సామేత. కానీ ఎంత పని లేకపోతే మాత్రం పిల్లిని పట్టుకుని దాని తలకు క్షవరం చేస్తాడా? అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఆలోచించి చూస్తే సామెతలు అనేవి సామాజిక అంశాలనుంచి వచ్చినవే అని తెలుస్తుంది. ఇంతకీ ఈ పిల్లేంటీ..తల గొరుగుడు ఏంటీ అని అనుకుంటున్నారా? అదే మరి సామెత గురించి చెప్పామంటే..అటువంటిదేదో ఉంటుంది కదా..అదే మరి ఓ హెయిర్ డ్రెస్సర్ నిజంగానే పిల్లి తలకు కటింగ్ హెయర్ కటింగ్ చేశాడు. హెయిర్ డ్రెస్సర్ అనే మోడ్రన్ గా అనుకుంటున్నాం. పాత కాలంలో క్షురకుడు అనేవారు. (అఫ్ కోర్స్ ఇప్పుడు వృత్తులు కులాలపై ఆధారపడి జరగటంలేదు..ఈ మోడ్రన్ కాలంలో ఎవ్వరైనా ఏ పని అయిన చేస్తున్నారు..దానినే వృత్తిగా చేసుకుంటున్నారు)

ఇంతకీ అసలు విషయంలోకి వస్తే..ఓ హెయిర్ డ్రెస్సర్. తెల్లగా ముద్దుగా ఉన్న పిల్లి తలకు కటింగ్ చేశాడు. అంతేకాదండోయ్..దాని మీసాలు కూడా కత్తిరించాడు. ఆ పిల్లి కూడా బుద్ధిగా తల ఏమాత్రం కదల్చకుండానే కటింగ్ చేయించుకుంది. దువ్వెన పెట్టి కటింగ్ చేస్తుండగా.. ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఓ కునుకు కూడా తీసింది కూడా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసుకోండీ..