Aman Khandelwal
Viral News: మీరు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా..? పలు కంపెనీల్లో ఇచ్చే రెజ్యూమ్ బుట్టదాఖలవుతున్నాయా.. ఈసారి వినూత్న రీతిలో రెజ్యూమ్ పంపించాలని ఆసక్తిగా ఉన్నారా.. అయితే ఈ విధానాన్ని ట్రై చేయండి.. ఓ వ్యక్తి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ వినూత్న రీతిలో కంపెనీలకు రెజ్యూ మ్ పంపించాడు. కంపెనీ యజమానుల దృష్టిని ఆకర్షించడానికి అతను ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా అవతారమెత్తాడు. పేస్ట్రీ బాక్స్‌లో కేక్‌తోపాటు రెజ్యూమ్‌ను కంపెనీలకు పంపించారు. ఇప్పుడు ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..
జైపూర్ కు చెందిన మేనేజ్మెంట్ ట్రైనీ అమన్ ఖండేవాల్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్న రీతిలో రెజ్యూమ్ పంపించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెరైటీగా ప్లాన్ చేశాడు. జొమాటో బాయ్ అవతారమెత్తి పేస్ట్రీ బాక్స్ లో కేక్ తో పాటు బెంగళూరులోని స్టార్టప్ కంపెనీలకు రెజ్యూమ్ పంపించాడు. జొమాటో టీ-షర్ట్, పేస్ట్రీల పెట్టెతో ఉన్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘ అన్ని రెజ్యూమ్ లు చెత్తబుట్టలోకి వెళ్లాయి.. కానీ, నా రెజ్యూమ్ మీ పొట్టలోకి వెళ్తుంది’. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
https://twitter.com/AmanKhandelwall/status/1543203379501236226?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1543499101823590400%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Frunning-of-job-seeking-ideas-this-bengaluru-man-dresses-up-as-zomato-executive-to-deliver-resume-with-pastries-3128120
అమన్ ఖండేవాల్ వినూత్న ఉపాయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఖండేవాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత ట్వీట్ లో అమన్ ఖండేవాల్ తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ను షేర్ చేశాడు. ఫుణేలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి పట్టభద్రుడయ్యాడు. అతను ఔత్సాహిక ప్రొడక్ట్ మేనేజర్. అయితే అమన్ ఖండేవాల్ ట్వీట్ కు జొమాటో స్పందించి.. తన కంపెనీ ట్విటర్ ఖాతాలో.. హాయ్ అమన్.. నీ ప్రదర్శన నీకు మేలుచేకూర్చుతుందని ఆశిస్తున్నాము. నీ ఆలోచన బాగుంది. అంటూ ట్వీట్ లో పేర్కొంది.
Hey Aman, hope your 'gig' landed you something meaningful. The idea was great, execution – top of the line, impersonation – not so cool.
— Zomato Care (@zomatocare) July 4, 2022