Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..

అఫ్గనిస్థాన్‌లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. పదిహేను వందల మందికిపైగా మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌తో సహా ఎన్నో దేశాలు అఫ్గనిస్థాన్‌కు అండగా నిలిచాయి. తాజాగా భూకంపం దాటికి నేలకూలిన ఇండ్ల శిథిలాల వద్ద ఓ పెంపుడు కుక్క దీనంగా తన యజమానికోసం ఎదురుచూస్తూ ఉంది.

Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..

Dog

Viral News: అఫ్గనిస్థాన్‌లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. పదిహేను వందల మందికిపైగా మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌తో సహా ఎన్నో దేశాలు అఫ్గనిస్థాన్‌కు అండగా నిలిచాయి. తాజాగా భూకంపం దాటికి నేలకూలిన ఇండ్ల శిథిలాల వద్ద ఓ పెంపుడు కుక్క దీనంగా తన యజమానికోసం ఎదురుచూస్తూ ఉంది. ఈ ఫోటోను సమీరా ఎస్ఆర్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పుడీఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Afganisthan Earthquake : శిథిలాల్లో బతుకులు..భూకంపంతో అత్యంత దుర్భరంగా అఫ్ఘాన్‌ ప్రజల జీవితాలు..

భూకంపం దాటికి ఇల్లు నేలకూలి పెంపుడు కుక్క యాజమాని, కుటుంబ సభ్యులు మరణించారు. కానీ కుక్క మాత్రం యాజమాని వస్తాడని ఈ శిథిలాల వద్ద ప్రతిరోజూ ఎదురు చూస్తుంది. కుక్కను గమనించిన స్థానికులు దానికి అన్నం పెడుతున్నారు. అయినా అది ధ్వసమైన ఆ ఇంటి వద్దనే కాపలా ఉంటుంది. నేలకూలిన గోడల వంక చూస్తూ తన యాజమానికోసం ఎదురు చూస్తుంది. ఈ ఘటనను చూసి స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Disease X: ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు?.. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరించారంటే..

ఈ పెంపుడు కుక్క ఫొటో పాక్‌టికా గ్యాన్లోని ఓచ్కీ గ్రామంలోనిది. ట్విటర్ లో పెంపుడు కుక్క ఫొటోను చూసిన పలువురు యాజమానిపై కుక్క ప్రేమను ప్రశంసిస్తున్నారు. వారిలో చాలా మంది కుక్కను దత్తత తీసుకోవాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. ఓ వినియోగదారుడు.. మునుపటి మాదిరిగానే కుక్కను ప్రేమించే, శ్రద్ధ వహించే యజమానిని దొరుకుతాడని ఆశిస్తున్నాను అంటూ ట్విట్ చేశారు. గుండెలను పిండేసే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. మనషులైనా ఇంత ప్రేమ చూపించరేమో అంటూ పెంపుడు కుక్కను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.