కొత్త లుక్ : విధుల్లో అభినందన్

  • Published By: madhu ,Published On : September 2, 2019 / 08:34 AM IST
కొత్త లుక్ : విధుల్లో అభినందన్

Updated On : May 28, 2020 / 3:44 PM IST

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తిరిగి విధుల్లో చేరారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లో ఆయన విధులు చేపట్టారు. కొత్త లుక్‌లో కనిపించారు. భారీగా ఉన్న మీసాలను తొలగించాడు. మిగ్ – 21లో అభినందన్ ప్రయాణించాడు. సుమారు ఆరు నెలల తర్వాత ఆయన విమానం నడిపాడు. చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్ విమానం విజయవంతంగా నడిపాడు. 

బాలాకోట్ దాడుల్లో ధైర్యంగా పోరాడాడు అభినందన్. పాక్ సైన్యానికి చిక్కిన ఈ వింగ్ కమాండర్..తిరిగి విధుల్లో చేరడం పట్ల అభినందనలు తెలియచేస్తున్నారు. ఇటీవలే భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని అందచేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన పుల్వామా ఘటన అనంతరం భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Read More : పార్లమెంట్ వద్ద కలకలం : కత్తితో పార్లమెంట్ లోకి వెళ్లేందుకు యత్నించిన యువకుడు
పాక్ యుద్ధ విమానాలు వెంటాడే క్రమంలో పాక్ ఆర్మీకి ఇతను చిక్కాడు. పాక్ సైనికులు అతడిని హింసించారు. కానీ భారత రహస్యాలను ఏ మాత్రం చెప్పలేదు. అతని తెగువ..ఆత్మస్థైర్యం అందరినీ కదిలించింది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వత్తిడి తీవ్రం కావడంతో పాక్ అతడిని రిలీజ్ చేసింది. అన్నీ మెడికల్ టెస్టుల అనంతరం అభినందన్ విధుల్లో చేరాడు.