covid-19 AbhiSCoVac : అన్ని వేరియంట్లకూ ఒకే ఒక్క టీకాతో చెక్..

కోవిడ్-19 అన్ని వేరియంట్లకూ ఒకే ఒక్క టీకాతో చెక్ పెట్టే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసారు భారత శాస్త్రవేత్తలు.

Covid New Vaccine Checking for Six Variants AbhiSCoVac : కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా మారుతు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న క్రమంలో ఈ వేరియంట్లు అన్నింటికి చెక్ పెట్టే ఓ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు మన భారత శాస్త్రజ్ఞులు. కోవాగ్జిన్, కోవీష్టీల్డ్ వంటి ఎన్నో రకాలు వ్యాక్సిన్లు కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో కోవిడ్ కట్టడికి ఓ ట్యాబ్లెట్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు పరిశోధకులు.

Also read : India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 32 రోజుల తర్వాత లక్షలోపు కేసులు

కానీ ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కొత్త కొత్త వేరియంట్లుగా రూపు మార్చుకుని ప్రపంచానికి కోవిడ్ మహమ్మారి సవాలు విసురుతునే ఉంది. టెల్టా వేరియంట్, ఒమిక్రాన్ అంటూ హడలెత్తిస్తోంది. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్లు రెండు మూడు డోసులే కాదు..మూస్టర్ డోసు వేయించుకున్నా సోకుతునే ఉంది. ఈక్రమంలో కోవిడ్ ఎన్ని వేరియంట్లు అయినా ఒకే ఒక్క వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చంటున్నారు మన భారతీయ పరిశోధకులు.

Kazi Nazrul University,కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు ఈ కోవిడ్ వేరియంట్లు అన్నింటికి చెక్ పెట్టే టీకాను. ఈ వ్యాక్సిన్ కు అభిస్కోవాక్‌ (AbhiSCoVac’ అని పేరు పెట్టారు.

Also read : Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..

ఇది పెప్టైడ్ వ్యాక్సిన్. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు రకాల వైరస్‌లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసే ఏకైక టీకా ప్రపంచంలో ఇదొక్కటేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి టీకా ఇదొక్కటే అని..ఈ వ్యాక్సిన్ ఒకటి కాదు రెండుకాదు ఏకంగా ఆరు రకాల వైరస్‌లను మట్టుబెట్టే వ్యాక్సిన్ ఇది అని చెబుతున్నారు. పరిశోధకులు అధ్యయనంలో..అభిస్కోవాక్‌ను రూపొందించడానికి ఇమ్యునోఇన్ఫర్మేటిక్ విధానాలను ఉపయోగించామని తెలిపారు.

Also read : Becareful with Covid tablets : కోవిడ్ ట్యాబ్లెట్ ‘మోల్నుపిరవిర్’తో ఎముకలకు ప్రమాదం : icmr చీఫ్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్ యూనివర్సిటీకి చెందిన అభిజ్ఞాన్ చౌదరి, సుప్రభాత్ ముఖర్జీ, ఐఐఎస్ఈఆర్‌కు చెందిన పార్థ్ సర్థి సేన్ గుప్తా, సరోజ్ కుమార్ పాండా, మలయ్ కుమార్ రాణా, భువనేశ్వర్‌లోని పరిశోధకులు మాట్లాడుతూ..” వ్యాక్సిన్ అత్యంత స్థిరంగా, యాంటీజెనిక్, ఇమ్యునోజెనిక్‌గా ఉందని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు