Becareful with Covid tablets : కోవిడ్ ట్యాబ్లెట్ ‘మోల్నుపిరవిర్’తో ఎముకలకు ప్రమాదం : icmr చీఫ్ వార్నింగ్

కోవిడ్ కు అందుబాటులోకి వచ్చిన ‘మోల్నుపిరవిర్’ ట్యాబ్లెట్ వల్లఎముకలకు ప్రమాదమని icmr చీఫ్ బలరాం భార్గవ హెచ్చరించారు.

Becareful with Covid tablets : కోవిడ్ ట్యాబ్లెట్ ‘మోల్నుపిరవిర్’తో ఎముకలకు ప్రమాదం : icmr చీఫ్ వార్నింగ్

Be Careful With Molnupiravir Covid Tablets

be careful with Molnupiravir covid tablets : ICMR : కోవిడ్-19 కు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఓ ట్యాబ్లెట్ వస్తే బాగుండు గుటుక్కున మింగేయొచ్చు అనుకున్నాం. శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ కు అత్యవసర వినియోగానికి ‘మోల్నుపిరవిర్’ అనే ట్యాబ్లెట్ కూడా వచ్చింది. ఈ ట్యాబ్లెట్ అనుమతులు కూడా వచ్చాయి. కానీ ఈ ‘మోల్నుపిరవిర్’ ట్యాబ్లెట్ వల్ల ప్రమాదముందని భారత వైద్య పరిశోధన మండలి (icmr) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరిస్తున్నారు. బుధవారం (జనవరి 5,2022) ఐసీఎంఆర్ చీఫ్ మాట్లాడుతు..అందుబాటులోకి వచ్చిన కరోనా ట్యాబ్లెట్ ‘మోల్నుపిరవిర్’తో మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని హెచ్చరించారు.

Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..

ఈ ట్యాబ్లెట్ వినియోగం వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే ‘మోల్నుపిరవిర్’ ట్యాబ్లెట్లను కొవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని వివరించారు. ఈ ట్యాబ్లెట్లు వాడిన మహిళలు మూడు నెలలపాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే పుట్టబోయే పిల్లలు పలు సమస్యల బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

కాగా, ‘మోలు లైఫ్ (200 ఎంజీ)’ పేరుతో వచ్చిన ఈ ట్యాబ్లెట్లను భారత్ లో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సి ఉంటుంది. ఒక్కో బాక్సులో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలి. అంటే పూటకు 800 ఎంజీ డోసు లెక్కన్నమాట. ఈ ట్యాబ్లెట్లు వాడేవారు కచ్చితంగా డాక్టర్ల సిఫారసుతో వాడాల్సి ఉంటుంది. స్వంత నిర్ణయాలతో ఏమాత్రం వాడకూడదు.

AP Covid -19 : ఏపీలో కరోనా..24 గంటల్లో 166 మందికి కరోనా…91 మంది డిశ్చార్జ్

కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మాత్రలు హైదరాబాద్ లో మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చాయి ఫార్మా సంస్థలు. మన దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో మ్యాన్‌కైండ్ మాత్రం రూ. 1,399కే అందుబాటులోకి తీసుకురాగా, సన్‌ఫార్మా రూ. 1,500, డాక్టర్ రెడ్డీస్ రూ. 1,400 ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.