Agricultural Laws : వ్యవసాయ చట్టాల రద్దు..కాంగ్రెస్ అప్పుడు ఏం చెప్పింది ? ఇప్పుడేం జరిగింది ?

నూతన వ్యవసాయ చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయంటూ ఆయన వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ అప్పట్లో వైరల్ అయ్యింది.

Agricultural Laws Congress  : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి…అటు రైతులు..ఇటు విపక్షాలు గొంతెత్తి అరిచాయి. పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశాయి. అయినా..కేంద్ర ప్రభుత్వం మాత్రం నో..చెప్పింది. రైతుల మేలు కోసమే తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని వాదించింది. మూడు నల్ల చట్టాలుగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. రైతులు చేస్తున్న పోరాటాలకు సంఘీభావమే ప్రకటించడమే కాకుండా..వారి తరపున ఆందోళనలు, నిరసనలు కూడా కొనసాగించింది. కొత్తగా ఏర్పడిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయగల చట్టాలను ఆమోదించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సూచించారు.

Read More : 3 Farm Laws : 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్నవిషయాలేంటి..?రద్దు చేయాలని రైతులు ఆందోళన ఎందుకు?కేంద్రం దిగివచ్చిన కారణాలేంటి?

తాము అధికారంలోకి వస్తే..ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం జరుగుతుందని ప్రియాంక గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రాహుల్ గాంధీ…కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ సరిహద్దులో దాదాపు ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ అప్పట్లో నిలదీశారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఏ పని చేయడం కోసం మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నరో ఆ పని చేయండి మోదీజీ అంటూ రాహుల్ సెటైర్స్ వేశారు.

Read More : Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు

గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలును ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయంటూ ఆయన వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ అప్పట్లో వైరల్ అయ్యింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో (గాజిపుర్​,టిక్రీ) ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢిల్లీ పోలీసులు తొలగిస్తున్న క్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్టిఫిషియల్ బారికేడ్లను మాత్రమే ఇప్పటివరకు తొలగించారని..త్వరలోనే మూడు రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ ఖాయమని.. అన్నదాతల సత్యాగ్రహం భేష్ అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Read More : New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

అయితే..అనూహ్యంగా…కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. రైతులను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా… రైతులను సంతృప్త పరచలేకపోయామని అందుకే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా రైతులకు మేలు చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని… అయితే… కొంతమంది రైతులు ఈ చట్టాల విషయంలో పూర్తి అసంతృప్తితో ఉన్నారని మోదీ చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆందోళన చేస్తున్న రైతులు… తమ ఉద్యమాన్ని విరమించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు