ABP C-Voter Survey: ఉత్తరప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటముల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ సాగుతోంది.

ABP C-Voter Survey: ఉత్తరప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ?

ABP-CVoter Survey

Updated On : January 6, 2022 / 9:32 PM IST

ABP C-Voter Survey: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటముల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా మినీపోల్స్‌గా పిలిచే ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి.

బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ సహా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా యూపీలో పోటీలో ఉంది. అన్నీ పార్టీలు తమదే విజయమని చెప్పుకుంటూ ఉండగా.. సమీకరణాలను చూస్తే, బీజేపీదే మళ్లీ విజయం అని అర్థం అవుతోంది.

యూపీ రాజకీయాల్లో రారాజు ఎవరు? అనే విషయం తెలుసుకోవడానికి, ABP న్యూస్ C ఓటర్ బృందం సర్వే నిర్వహించింది. సర్వే వివరాల ప్రకారం.. యూపీలో అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని సర్వే లెక్కలు చెబుతుండగా.. గ‌త 4 స‌ర్వేల ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల దృష్టిలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుందని చెబుతున్నారు.

దేశంలోనే పెద్ద రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లేటెస్ట్ సర్వేలో 49శాతం మంది చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 30 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో, ఈ ఏడాది ఎన్నికల్లో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని 7 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుందని 7 శాతం మంది మాత్రమే చెబుతున్నారు. 2 శాతం మంది ప్రజలు అధికారం ఎవరికి వస్తుందో చెప్పలేకపోతున్నట్లు చెప్పారు. ఒక శాతం మంది హంగ్ అసెంబ్లీ వస్తుందని చెబుతున్నారు.

సర్వేల వివరాలు తేదీల వారీగా..

16DEC- 23DEC- 29DEC- 06JAN

BJP
47-48-49-49

SP:
31-31-30-30

BSP:
8 7 8 7

Congress:
6 6 6 7