Gautam Adani Bribery Case : అదానీపై అమెరికాలో లంచం కేసు.. అసలు ఎవరికి లంచం ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?

మరిప్పుడు ఏం జరగబోతోంది? ఆయన అరెస్ట్ అవుతారా? తన మీద తన కంపెనీ మీద కుట్ర చేశారని ఆరోపిస్తున్న అదానీ.. అమెరికా కోర్టుల్లో నెగ్గుకు రాగలరా?

Gautam Adani Bribery Case : పరిచయం అవసరం లేని పేరు గౌతమ్ అదానీ. పేరును బ్రాండ్ లా మార్చుకున్న బిజినెస్ మ్యాన్. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ ఉండే అదానీని వివాదాలు కూడా ఎళ్ల వేళలా వెంటాడుతూనే ఉంటాయి. హిండెన్ బర్గ్ నివేదిక రేపిన రచ్చతో దేశ పార్లమెంట్ అదిరిపోయింది. ఆ రచ్చ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుండగా.. అమెరికాలో ఆయనపై లంచం కేసు నమోదైంది. దీంతో ఆయన కంపెనీ షేర్లు దబేల్ మని పడిపోయాయి. అసలు అదానీ లంచం ఇవ్వడం ఏంటి? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?

అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్ట్ పనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతి అధికారులకు అదానీ కోట్ల రూపాయల లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. దీంతో అదానీపై మోసపూరిత కుట్రల కింద అభియోగాలు నమోదు చేశారు. ఇదిప్పుడు స్టాక్ మార్కెట్ లోనే కాదు రాజకీయంగా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మోదీ సర్కార్ ను విపక్షాలు మళ్లీ టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ రచ్చకు కారణం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు అదానీ మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్ బీఐ చెబుతోంది. 20ఏళ్లలో 2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 16వేల 700 కోట్లు లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్ ల కోసం వీళ్లు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రూ.265 మిలియన్ డాలర్లు అంటే 2వేల 29 కోట్లకు పైగా లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికా ఎఫ్బీఐ అధికారులు గుర్తించారు.

బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్ లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండంతో.. ఆ దేశం ఎఫ్ బీఐ ద్వారా దర్యాఫ్తు చేస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల త్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అరెస్ట్ వారెంట్ తో అదానీకి అమెరికా అదిరిపోయే షాక్ ఇచ్చింది. మరిప్పుడు ఏం జరగబోతోంది? ఆయన అరెస్ట్ అవుతారా? తన మీద తన కంపెనీ మీద కుట్ర చేశారని ఆరోపిస్తున్న అదానీ.. అమెరికా కోర్టుల్లో నెగ్గుకు రాగలరా? ఇదిలా ఉంటే.. మరోవైపు దేశంలో రాజకీయ రచ్చకు తెర లేచింది. కాంగ్రెస్ అందుకున్న కొత్త నినాదం పాలిటిక్స్ ను మరింత షేక్ చేయబోతోంది అనే చర్చ జరుగుతోంది.

పూర్తి వివరాలు..

Also Read : అదానీని అరెస్ట్ చేయరు.. ఆయనపై విచారణ జరగదు.. ఎందుకో చెప్పిన రాహుల్ గాంధీ