Aadhaar EPF link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా.. ఇక డబ్బులు రావంతే

ఈపీఎఫ్ అకౌంట్లలో ఈ నెల (జూన్) నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఒకవేళ మీ UAN నెంబర్‌కు ఆధార్ లింక్ చేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142 తప్పనిసరి చేశారని ఎంప్లాయీస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్...

Aadhaar EPF link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా.. ఇక డబ్బులు రావంతే

Adhaar Not Linked To Epf Account No Credit

Updated On : June 8, 2021 / 12:38 PM IST

Aadhaar EPF link: ఈపీఎఫ్ అకౌంట్లలో ఈ నెల (జూన్) నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఒకవేళ మీ UAN నెంబర్‌కు ఆధార్ లింక్ చేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142 తప్పనిసరి చేశారని ఎంప్లాయీస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇది జూన్ 1 నుంచే అమల్లోకి వస్తుందని అన్నారు.

ఇందులో సంస్థ కాంట్రిబ్యూషన్, ఉద్యోగి కాంట్రిబ్యూషన్ రెండూ కలిసే ఉంటాయి. సంస్థ ఉద్యోగికి సంబంధించిన ఎలక్ట్రానిక్ చలానా కమ్ రిటర్న్ (ఈసీఆర్)ను అప్ లోడ్ చేయడానికి వీలుండదు. అంటే ఆధార్ లింక్ చేయని ఖాతాదారుని యొక్క ఈపీఎఫ్ వివరాలు అప్ డేట్ చేయడానికి వీలుండదు’ అని డెలాయిటీ ఇండియా పార్టనర్ సరస్వతి కస్తూరిరంగన్ స్పష్టం చేశారు.

చాలా సంస్థలు ఉద్యోగులు జాయిన్ అయ్యే సమయంలోనే ఆధార్ వివరాలు అడిగి తీసుకుంటున్నాయి. ఒకవేళ అలా చేయకపోతే వాటిని ఈపీఎఫ్ సభ్యత్వం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ లోనూ వాటిని నమోదు చేయాలి. ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ కు ఆధార్ అవసరం లేకపోయినా విత్ డ్రా చేసేటప్పుడు కచ్చితంగా కావాలి.