Aditya Birla: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్ హక్కులు

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ స్పోర్ట్స్ బ్రాండ్ రీబాక్ మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇండియాతో పాటు ఆసియా దేశాల్లోని బ్రాండ్ రిటైల్ స్టోర్స్ లో రీ బాక్.

Aditya Birla: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్ హక్కులు

Aditya Birla

Updated On : December 15, 2021 / 1:30 PM IST

Aditya Birla: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ స్పోర్ట్స్ బ్రాండ్ రీబాక్ మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇండియాతో పాటు ఆసియా దేశాల్లోని బ్రాండ్ రిటైల్ స్టోర్స్ లో రీ బాక్ ప్రొడక్ట్స్ ను హోల్ సేల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు.. లేదా అమ్ముకోవచ్చు.

న్యూయార్క్‌కు చెందిన ఆథెంటిక్‌ బ్రాండ్‌ గ్రూపు(ABG), మార్కెటింగ్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ కంపెనీ అండ్ ఏబీఎఫ్ఆర్ఎల్ (ABFRL)లు దీర్ఘకాలిక లైసెన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రీబాక్‌ ప్రొడక్ట్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడానికే ఏబీఎఫ్ఆర్ఎల్ ప్రత్యేక హక్కులు దక్కించుకుంది.

ఇంటర్నేషనల్‌గా రీబాక్‌ బ్రాండ్‌ రైట్స్ ఆదిదాస్‌ నుంచి ఆథెంటిక్‌ బ్రాండ్‌ గ్రూపుకు బదిలీ కానుండడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్ని షరతులకు లోబడి ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఇరు సంస్థలు ప్రకటించాయి.
2021 ఆర్థిక సంత్సరంలో రీబాక్‌ ఇండియా రూ.4.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 93 శాతం తగ్గింది.

……………………………….: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 9మంది మృతి