హిట్లర్ బతికుంటే.. మోడీ చర్యలతో ఆత్మహత్య చేసుకుంటాడు : మమతా
ప్రధాని నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికలు మరో 48 గంటల్లో ప్రారంభం కానున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికలు మరో 48 గంటల్లో ప్రారంభం కానున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికలు మరో 48 గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో మమతా మోడీపై విమర్శనాస్త్రాలను సంధించారు. నియంతృత్వ పాలనకు రాజు అంటూ మోడీపై ధ్వజమెత్తారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను
అడాల్ఫ్ హిట్లర్ ఇప్పుడు జీవించి ఉంటే మోడీ యాక్టివీటిసీస్ చూసి వెంటనే ఆత్మహత్య చేసుకుంటాడని ఘాటుగా విమర్శించారు. మంగళవారం (ఏప్రిల్ 9, 2019) రాయ్ గంజ్ లో తృణమూల్ చీఫ్ మమత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఆయన పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి విపక్షాల నోరు నొక్కుతున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కిన మోడీ బయోపిక్ పై కూడా మమతా చురకలు అంటించారు. గుజరాత్ లో జరిగిన అల్లర్లను ఇంకా ఎవరూ మరువలేదని, మోడీ బయోపిక్ లో దీని ప్రస్తావన ఉండి తీరాలన్నారు. పశ్చిమ బెంగాల్ లో మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 11, 18, 23, 29వ తేదీన, మే 6, 12, 19తేదీల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.
Read Also : కేసీఆర్ ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకో : చంద్రబాబు