Prashant Kishor Retirement: ఇక సెలవ్.. ప్రశాంత్ కిషోర్ ప్రకటన!

Prashant Kishor retires: దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహాల్లో సుప్రసిద్ధులైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీల గెలుపు విషయంలో కీలకపాత్ర పోషించే ప్రశాంత్ కిషోర్.. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తన పాత్రను పోషించి, అక్కడి పార్టీల గెలుపుకు కృషి చేశారు.

ఎన్నికల్లో ఎలా గెలవాలో పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా పేరుతెచ్చుకున్న కిషోర్.. ఇకపై ఎన్నికల వ్యూహాల్లో కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు. జీవితంలో మరేదైనా చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. టీఎంసీ, డీఎంకేల కోసం పనిచేశారు. ఈ రెండు పార్టీలు ఆయా ఎన్నికల్లో గెలిచాయి.

రిటైర్మెంట్ ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. బెంగాల్ గెలిచిందని, అందుకోసం ఎంత చేయాలో అంతా చేశానని అన్నారు. కొంతకాలం విరామం తీసుకుని తర్వాత ఏం చెయ్యాలనేదాని గురించి ఆలోచిస్తానని అన్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చినా, విఫలం అయ్యానని చెప్పుకొచ్చారు.

బెంగాల్‌లో బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే వ్యూహకర్తగా తప్పుకుంటానని పలుమార్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు