Bride Collapses : కుప్పకూలిన వధువు, మంటపం నుంచి పారిపోయిన వరుడు

ఓ పెళ్లి కూతురు కుప్పకూలడంతో మంటపం నుంచి వెళ్లిపోయాడో వరుడు. ఊహించని మలుపుతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Bride Collapses : కుప్పకూలిన వధువు, మంటపం నుంచి పారిపోయిన వరుడు

Bride

Updated On : July 22, 2021 / 5:55 PM IST

Bride Collapses During Rituals :  పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఆ జ్ఞాపకాలను గుర్తుండిపోయేలా కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. వారి స్థోమతలకు అనుగుణంగా వివాహాలు చేసుకుంటుంటారు. అయితే..కొన్ని పెళ్లిళ్లలో జరిగే ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..ఓ పెళ్లి కూతురు కుప్పకూలడంతో మంటపం నుంచి వెళ్లిపోయాడో వరుడు. ఊహించని మలుపుతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More : MLA Seethakka : ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

వీడియోలో వధువు కిందకూర్చొగా..వరుడు నిల్చొని ఉన్నాడు. పక్కనే ఉన్న మహిళ, వరుడి చేత వధువుకు సింధూరు పెట్టించే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా వధువు కుప్పకూలిపోయింది. వధువును లేపడానికి ప్రయత్నించగా..వరుడు మాత్రం మెడలో ఉన్న పూలదండను కిందపారేసి..మంటపం నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిపోకుండా ఉండేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. చేయి పట్టుకుని లాగింది. వరుడు ఇవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. బాలీవుడ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ వినిపిస్తున్న ఈ వీడియోను official_niranjanm87 ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. 45,360 likes రాగా..పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)