Kali Poster: కాళీ పోస్టర్ తర్వాత కన్యాకుమారిలో శివుడు సిగరెట్ అంటించుకుంటున్న పోస్టర్
కొద్ది రోజులుగా వివాదాస్పదమైన కాళీ మాత పోస్టర్ మాదిరిగా తమిళనాడులోని కన్యాకుమారిలో మరొకటి దర్శనమిచ్చింది. ఈశ్వరుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉన్న బ్యానర్ ను పోలీసులు గమనించారు. పబ్లిక్ ను పిలిచి దానిని అంటించిన వారిని హెచ్చరించి కాంట్రవర్సీ కాకముందే తొలగొంచారు.
Kali Poster: కొద్ది రోజులుగా వివాదాస్పదమైన కాళీ మాత పోస్టర్ మాదిరిగా తమిళనాడులోని కన్యాకుమారిలో మరొకటి దర్శనమిచ్చింది. ఈశ్వరుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉన్న బ్యానర్ ను పోలీసులు గమనించారు. పబ్లిక్ ను పిలిచి దానిని అంటించిన వారిని హెచ్చరించి కాంట్రవర్సీ కాకముందే తొలగొంచారు.
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు హిందూ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాలోని తింగల్ నగర్ ఆరోగ్యపురంలో ఈ ఘటన జరిగింది.
రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్తూ.. రెండు ప్లేస్ లలో అతని ఫ్రెండ్స్ ఇటువంటి బ్యానర్లు పెట్టారు. అందులో ఒక దానిలో కంగ్రాట్స్ చెబుతున్నట్లుగా, మరొక దానిలో శివుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉంది.
Read Also: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
పైగా ఈ బ్యానర్ లో జుట్టు చాలా తక్కువ పొడవుగా ఉంచుకోవాలని, భార్యకు అందనంత పొట్టిగా కత్తిరించుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
కాళీ మాత పోస్టర్ వివాదం:
ప్రముఖ దర్శకురాలు లీనా మణిమేఖలై నిర్మిస్తున్న డాక్యుమెంటరీ చిత్రం ‘కాళీ’ కి సంబంధించిన పోస్టర్ కూడా ఇదే విధంగా ఉంది. ఈ పోస్టర్లో కాళీమాత వేషధారణలో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకోగా, మరో చేత్తో సిగరేట్ తాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇంకో చేతిలో ఎల్ జీబీటీ జెండాను పట్టుకున్నట్టు పోస్టర్ ను సినిమా బృందం రూపొందించారు. కాళీమాతను ఇలా కించ పరుస్తూ చూపించడంపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.