Independence Day 2023
Independence Day 2023 : 1947, ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. భారతదేశానికి బ్రిటీషు వారి పాలన నుంచి విముక్తి కలిగింది. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మన దేశపు జాతీయ జెండాను గర్వంగా ఎగరేస్తాం. దేశ శక్తిని చాటుకుంటాం. భారత ప్రధాని మోడీ ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం ద్వారా మన జాతీయ జెండాకు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టారు. అయితే జాతీయ జెండా అనేక మార్పులు సంతరించుకున్నాక ఆమోదించబడింది. 1906 నుంచి 1947 వరకు మన జెండా ప్రయాణం ఓసారి తెలుసుకుందాం.
భారతదేశానికి జాతీయ జెండాను ఆమోదించి 71 సంవత్సరాలు అవుతోంది. 1931 లో రాజ్యాంగ సభ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను ఆమోదించింది. అసలు జాతీయ జెండాను తయారు చేయాలనే ప్రయత్నం 1906 నుంచి మొదలైంది. 1906 ఆగస్టు 7 న కోల్‌కతాలో మొదటి జెండాను ఎగరేశారు. ‘వందేమాతరం’ అనే పదాలతో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఈ జెండాను రూపొందించారు. సచింద్ర ప్రసాద్ బోస్, హేమచంద్ర కనుంగో అనే న్యాయవాదులు దీనిని రూపొందించారని చెబుతారు.
1907 లో మేడమ్ కామా, సచింద్ర ప్రసాద్, బోస్ సుకుమార్ మిత్రాలు తొలి అనధికారిక జెండాను రూపొందిస్తే దీనిని కోల్‌కతాలోని పార్శి బెగన్ స్క్వేర్ వద్ద ఎగరవేశారు. 1917 లో మేడం బికాజీ వీర్ సవార్కర్, శ్యామ్ జీ కృష్ణ వర్మలు జాతీయ జెండాను రూపొందించారు. 1907, ఆగస్టు 22 న జర్మనీలోని స్టర్గార్ట్‌లో మేడం కామా ఎగరేసిన జెండాకు ‘సప్తరుషి జెండా’ అని పేరు పెట్టారు. 1921 లో ‘సంయుక్త జెండా’ను రూపొందించారు. తెలుపు మైనార్టీలు, పచ్చరంగు ముస్లింలు, ఎరుపు రంగు హిందులను సూచించేలా అన్నింటినీ రాట్నం కలుపుతుంది. దేశంలోని అన్ని మతాలను ప్రతిబింబించేలా ఈ జెండాను రూపొందించారు.
1931 లో కాంగ్రెస్ కమిటీ అధికారిక జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద పచ్చ రంగు వాటి మధ్య రాట్నంతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఆ తరువాత ఆ జెండాలో స్వల్ప మార్పులు చేసి ప్రస్తుతం ఉన్న జెండాను తయారు చేశారు. రాట్నానికి బదులు అశోక చక్రాన్ని ఏర్పాటు చేశారు. డా. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ జెండాకు ఆమోదం తెలిపింది. ఇన్ని మార్పులు సంతరించుకున్న మన దేశపు జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగరేస్తున్నాం. జెండా పండుగను చేసుకుంటున్నాం. గర్వంగా, గౌరవంగా సెల్యూట్ చేస్తున్నాం. ఇది మన జాతీయ జెండా ప్రయాణం.
Our pride in different colours. ?? pic.twitter.com/VCngGpMWlI
— बेवजह-के-ख़याल (@MeriKhanii) August 14, 2023