Jayanti Bhattacharya : సుధామూర్తిని కలిసాక.. ‘ఎలోన్ మస్క్‌ల ప్రపంచంలో’ అంటూ ఓ మహిళ పోస్ట్ వైరల్
వ్యాపారవేత్త జయంతి భట్టాచార్య రీసెంట్‌గా సుధామూర్తిని ఎయిర్ పోర్ట్‌లో కలుసుకున్నారు. ఆ తరువాత ఆమె లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ పోస్ట్‌లో ఏం రాసారు?

Jayanti Bhattacharya
Jayanti Bhattacharya : వ్యాపారవేత్త జయంతి భట్టాచార్య ఎయిర్ పోర్టులో సుధామూర్తిని కలిసారు. ఆ తరువాత తన అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసుకున్నారు. ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Sudha Murthy :ప్రభాస్ సినిమా పాటంటే సుధామూర్తికి చాలా ఇష్టమంట.. ఏ పాటో తెలుసా?
ఇండియా హెంప్ అండ్ కో కో-ఫౌండర్ జయంతి భట్టాచార్య రచయిత్రి, సమాజ సేవకురాలు మిసెస్ సుధామూర్తిని ఎయిర్ పోర్టులో కలిసారు. ఆమెతో దిగిన ఫోటోతో పాటు ఆమెతో గడిపిన క్షణాల్ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసుకున్నారు. ‘ఆమె దయ, తెలివితేటలు, సృజనాత్మకత గురించి విన్నాను. ఆమె సహనం, వినయం, సరళత నన్ను కదిలించాయి. శ్రీమతి సుధామూర్తి మాతో బిజీగా ఉన్న విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అందరితో మాట్లాడుతున్నారు. కనెక్ట్ అవుతున్నారు. ఎలోన్ మస్క్‌ల ప్రపంచంలో మన సుధామూర్తి ఎల్లప్పుడూ ఉంటారని తెలుసుకోవడం మంచిది’ అనే శీర్షికను జోడించారు.
Sudha Murthy : వెజ్, నాన్-వెజ్‌కి ఒకటే స్పూన్ వాడటంపై సుధామూర్తి వ్యాఖ్యలు వైరల్
భట్టాచార్య పోస్టుపై లింక్డ్‌ఇన్‌లో చాలామంది స్పందించారు. “నిజమే, జయంతి భట్టాచార్య! ఆమె సాధించిన విజయాల మద్య రోజువారి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం ఆమె డౌన్-టు-ఎర్త్ స్వభావానికి నిదర్శనం’ అని ఒకరు.. ‘ఆమె అన్ని స్థాయిల వ్యక్తులతో కనెక్ట్ అయ్యే నైపుణ్యం కలిగిన అరుదైన మహిళ. ఆమె సరళత, సాదాసీదాగా మాట్లాడటం గ్రేట్ ‘ అంటూ మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.