Sudha Murthy : వెజ్, నాన్-వెజ్‌కి ఒకటే స్పూన్ వాడటంపై సుధామూర్తి వ్యాఖ్యలు వైరల్

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. భార్య సుధామూర్తి అందరికి సుపరిచితమే. తనకి సంబంధించిన అనేక విషయాలు షేర్ చేస్తుంటారు. చాలామందిలో ప్రేరణ కలిగిస్తుంటారు. తాజాగా 'వెజ్..నాజ్ వెజ్ స్పూన్' అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

Sudha Murthy : వెజ్, నాన్-వెజ్‌కి ఒకటే స్పూన్ వాడటంపై సుధామూర్తి వ్యాఖ్యలు వైరల్

Sudha Murthy comments went viral

Updated On : July 26, 2023 / 3:26 PM IST

Sudha Murthy comments went viral : ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మాట తీరు, కట్టు బొట్టు నుంచి ఆమె సింప్లిసిటీ, వ్యక్తిత్వాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే తాజాగా తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.

Sudha Murthy : నేను యూకే ప్రధాని అత్తగారినంటే నమ్మలేదు ‘జోక్‌ చేస్తున్నారా? అన్నారు : సుధామూర్తి

‘ఖానే మే కౌన్ హై’ అనే యూ ట్యూబ్ సిరీస్‌లో భాగంగా ఆవిడ తాజా ఎపిసోడ్‌లో కనిపించారు. ఆ ఎపిసోడ్‌లో తాను స్వచ్ఛమైన శాఖాహారిని అని గుడ్లు, వెల్లుల్లిని  కూడా తినను అని.. తనకు భయం కలిగించే అంశం ఏంటంటే శాఖాహారం, మాంసాహారం రెండింటికీ కూడా ఒకటే చెంచా వాడటం తన మనస్సుని బాధిస్తుందని’ చెప్పుకొచ్చారు. ‘విదేశాలకు వెళ్లినపుడు శాఖాహార రెస్టారెంట్ల కోసం వెతుకుతానని తన భోజనం తానే రెడీ చేసుకుంటానని.. అవసరమైనపుడు తన వెంట ఆహారం తీసుకువెడతానని’ కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు షేర్ చేశారు. ఇంటి నుంచి ఆహారం తీసుకువెళ్లడం నిజంగా మంచి పద్ధతి అని కొందరు అంగీకరించగా.. మరికొందరు విభేదించారు.

Sudha Murthy Narayana Murthy Love story : ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సుధాల లవ్ స్టోరీ .. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పి సిగ్గుపడిన సుధామూర్తి

“వ్యక్తులను వారి ఆహార అభిరుచులను బట్టి అంచనా వేయకూడదు.. గౌరవంగా చూడటంపై దృష్టి పెట్టాలి’ అని కొందరు ..‘ఫారిన్ ట్రిప్స్‌లో సుధా మూర్తి తన ఇంటిని తన వెంట తీసుకెళ్తుంటుంది, ఆ హోటల్ గదిని వేరే వ్యక్తి వాడితే ఎలా ఉంటుంది?’ అని మరొకరు సరదాగా జోడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.