Sudha Murthy :ప్రభాస్ సినిమా పాటంటే సుధామూర్తికి చాలా ఇష్టమంట.. ఏ పాటో తెలుసా?

సుధామూర్తి గురించి పరిచయం అక్కర్లేదు. ఆవిడకి చాలామంది అభిమానులు ఉన్నారు. అదలా ఉంచితే ఆవిడకి ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటో తెలుసా?

Sudha Murthy :ప్రభాస్ సినిమా పాటంటే సుధామూర్తికి చాలా ఇష్టమంట.. ఏ పాటో తెలుసా?

Sudha Murthy

Updated On : August 12, 2023 / 6:50 PM IST

Sudha Murthy Song : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Infosys Narayana Murthy) సతీమణి సుధామూర్తి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆవిడ సింప్లిసిటీ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఇంటర్వ్యూల్లో ఆవిడ చెప్పే అనేక విషయాలపై ప్రేరణ పొందుతుంటారు. సుధామూర్తి ఇటీవలే వెజ్-నాన్ వెజ్ అంటూ చేసిన వ్యాఖ్యలతో వైరల్ కూడా అయ్యారు. రీసెంట్‌గా సుధామూర్తి తనకు ఇష్టమైన తెలుగు సినిమా పాటేంటో (Telugu Song) చెప్పారు.

Sudha Murthy : వెజ్, నాన్-వెజ్‌కి ఒకటే స్పూన్ వాడటంపై సుధామూర్తి వ్యాఖ్యలు వైరల్

సుధామూర్తి తరచు మీడియాతో మాట్లాడుతుంటారు. ఎన్నో విలువైన విషయాలు చెబుతుంటారు. ఆ మధ్య తన కూతురి వల్లే రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యాడంటూ మాట్లాడారు. ఆ కామెంట్లు చాలా వైరల్ అయ్యాయి. అంతేకాదు తనను యూకే ప్రధాని అంటే ఎవరు నమ్మట్లేదు అని ఓ సందర్భంలో చెప్పారు. వెజ్.. నాజ్ వెజ్ స్పూన్ అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఇవన్నీ ఇలా ఉంటే సుధామూర్తి తెలుగు సినిమా పాటలు అంటే కూడా మక్కువ చూపిస్తారట. మరి ఆవిడకి ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటో తెలుసా? ప్రభాస్ (Prabhas) నటించిన ‘మిర్చి’ సినిమాలోని ‘కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే’ పాట తనకి చాలా ఇష్టమని సుధామూర్తి చెప్పారు. అంతేకాదు ఆ పాట ప్లే అవుతుంటే సరదాగా హమ్ చేశారు కూడా.

Sudha Murthy : నేను యూకే ప్రధాని అత్తగారినంటే నమ్మలేదు ‘జోక్‌ చేస్తున్నారా? అన్నారు : సుధామూర్తి

prabhas_ashok అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలామందిని ఆకట్టుకుంది. ఆవిడలోని ఎన్నో ఎలిమెంట్స్ చూసి అభిమానించే వారు చాలామంది ఉన్నారు. ఇక ఈ వీడియో ప్రభాస్ అభిమానులు చూస్తే ఎంత సంతోష పడిపోతారో?

 

View this post on Instagram

 

A post shared by Prabhas ashok (@prabhas__ashok)