కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!

బినామీ చట్టం బలోపేతం, అనధికార బ్యాంక్ లావాదేవీలు, ఇతరుల పేర్లతో ఆర్థిక వ్యవహారాలు ఇలాంటి వాటి అన్నింటికీ కేంద్రం చెక్ పెట్టింది. అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ బిల్లు-2019కి సవరణ ప్రతిపాదనలకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లుకి క్లియరెన్స్ రావటంతో ఎవరి ఆస్తులు వారి దగ్గరే ఉండబోతున్నాయి. బినామీలు ఉన్న వాళ్లందరూ ఓనర్లు అయినా ఆశ్చర్యం లేదు. ఇక నుంచి ఆ వ్యక్తి చేసే వ్యాపారం, ఉద్యోగం, వృత్తి ఆధారంగా అతని ఆస్తులను కూడా పరిశీలించనున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత కాలంలో జీతంతో ఎంత సంపాదించొచ్చు అనే ఓ అంచనా వేసి.. దాని ఆధారంగా ఆస్తులను లెక్కింపు చేయనున్నారు. ఇక ఓ వ్యాపారి ఆస్తులకు కూడా ఇదే తరహా వర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకుల ఆస్తులు ఎంత – ఎంత పన్ను కడుతున్నారు అనేది కూడా ఇక నుంచి ఈ చట్టం ద్వారా పారదర్శకత రానుంది.
Read Also: పవన్ కూడా అదే జిల్లాలో : రైతు సమస్యలపై కర్నూలుకు రేణూ దేశాయ్
బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం, వెనక్కి తీసుకోవటం సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం ఈ చట్టం ప్రవేశపెట్టింది. చట్టాన్ని అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు విధించనున్నట్లు చెబుతుంది. అక్రమ మార్గాల్లో డిపాజిట్ల వసూలు లేదా చెల్లింపులు చేసే పథకాలను అడ్డుకొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. దీని వల్ల ఇక నుంచి బ్యాంకుల్లో ఇష్టానుసారం డిపాజిట్లు ఉండకపోవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఓ వ్యక్తి బ్యాంక్ లావాదేవీలపై మరింత నిఘా పెరగటంతోపాటు.. డిపాజిట్ చేసే సొమ్ముపైనా పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది కస్టమర్లు. ఎన్నికల సమయంలో వచ్చిన ఈ కొత్త చట్టం, విధివిధానాల వల్ల బ్యాంకుల్లో డబ్బు కొరత రావొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు.
2017లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు మూడు నెలల ముందు బ్లాక్ మనీ పేరుతో పెద్ద నోట్ల రద్దు జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చినట్లు ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం బంధువులు దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్ ద్వారా లావాదేవీలు జరగాలి అనే నియమం ఉంది. ఈ కొత్త బిల్లుతో మళ్లీ నోట్ల రద్దు కష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. లావాదేవీలు చట్టప్రకారం చేయలేని పరిస్థితిలో నోట్లు మార్పిడి ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల నోట్ల కొరత ఏర్పవచ్చు. ఎన్నికలకు ముందు ఈ నిర్ణయంతో ఏటీఎంలు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్ధికవేత్తలు చెబుతున్నారు.
Read Also: మనిషేనా..అది కడుపేనా : రాళ్లు..కాయిన్స్..బోల్డులు అన్నీ మింగేసి