Bengaluru Rains : మరోసారి బెంగళూరుని వణికించిన భారీ వర్షాలు, మరో 5 రోజులు వాన గండం, ఎల్లో అలర్ట్ జారీ
వానలు బెంగళూరుని బెంబేలెత్తిస్తున్నాయి. మరోసారి భారీ వాన ముంచెత్తడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

Bengaluru Rains : కర్నాటకలో మరో ఐదు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీంతో బెంగళూరుకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే.. మరోసారి బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. నగరం అంతా వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వానలు బెంగళూరుని బెంబేలెత్తిస్తున్నాయి. మరోసారి భారీ వాన ముంచెత్తడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదకు ఇళ్లలోని వస్తువులు, బైకులు కొట్టుకుపోయాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు అపార్ట్ మెంట్లు, సెల్లార్లలోకి నీరు చేరింది. నీటిలో వాహనాలు మునిగాయి.
బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమైన వాన కుండపోతగా కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం కోరింది. భారీ వర్షానికి నగరంలోని అన్ని ప్రాంతాల్లో వరద పోటెత్తింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గత నెల మొదటి వారంలో కూడా బెంగళూరు సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో బెంగళూరు నగరం ఆ సమయంలో వరదమయమైంది. వరదల ధాటికి రెండు రోజుల పాటు నరకం చూశారు నగర వాసులు.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులో 1700 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. బెంగళూరు సిటీలో ఇంత భారీ స్థాయి వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారి.