12ఏళ్లకే జర్నలిస్టు.. ఎన్నికల్లోనూ పోటీ చేస్తాడంట

12ఏళ్లకే జర్నలిస్టు.. ఎన్నికల్లోనూ పోటీ చేస్తాడంట

Updated On : October 16, 2019 / 2:41 AM IST

హర్యానా ఎన్నికల్లో సెన్సేషనల్ గా మారాడు ఈ బుడ్డోడు. ఎంతో సీనియారటీ ఉన్న జర్నిలస్టుల్లాగా ముఖ్య నేతలను ఇంటర్వ్యూలు చేసి అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటున్నాడు. బింద్‌కు చెందిన గుర్మీత్ గోయత్(12) ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జననాయక్ జనతాపార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా వంటి నేతలను ఇంటర్వ్యూ చేశాడు. 

తన సొంత యూ ట్యూబ్ ఛానెల్‌లో ఈ ఇంటర్వ్యూలు పోస్టు చేసి టెలికాస్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇంతవరకూ 100కి పైగా ఇంటర్వ్యూలు చేసిన ఈ బుడ్డి జర్నలిస్టు భవిష్యత్‌లో రాజకీయ నేతగా ఎదుగుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.  

‘ఇది మా తాతగారి కల. ఆయన ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. మనిషికి ఏదో ఒక గుర్తింపు ఉండాలని మైలురాళ్లను దాటాలని చెప్తుండేవారు. ఇప్పుడు నాతో లేనప్పటికీ నా కలను పూర్తి చేసుకోవడానికి కష్టపడుతున్నాను. నాకు జర్నలిజం అంటే ఇష్టం. 2034నాటికి జర్నలిస్టు కోర్సు పూర్తిచేస్తాను. దీంతో పాటు రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. 

అవకాశం వస్తే దానిని కూడా వదులుకోను. స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి తీరతాను. నా తల్లిదండ్రుల నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా వాళ్లే నన్ను ప్రోత్సహిస్తారు’ అని ఈ బుడ్డి జర్నలిస్టు చెప్పుకొచ్చాడు.