Rescue operation : వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన వాయుసేన అధికారులు

వర్షాల దాటికి మహారాష్ట్రలోని చాలా గ్రామాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వాయుసేన వారికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

Rescue Operati

Rescue operation : వర్షాలతో దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో వర్షం తీవ్రత అధికంగా ఉంది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరెంట్ స్తంబాలు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సమాచారం ఇచ్చింది. దీంతో ఎంఐ-17 హెలిక్యాప్ట‌ర్ల‌ను రంగంలోకి దించి రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.

ఇందులో భాగంగా వాయుసేన అధికారులు ఓ హెలిక్యాప్ట‌ర్ సాయంతో లాతూర్ జిల్లాలోని పొహ‌రెగావ్ గ్రామంలో వ‌ర‌ద‌నీటిలో చిక్కుకున్న వారిని ర‌క్షించారు. వ‌ర‌ద‌లు చుట్టుముట్ట‌డంతో స్థానికంగా ఓ రేకుల షెడ్డుపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఎయిర్‌ఫోర్స్ అధికారులు సుర‌క్షితంగా బ‌య‌టికి తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు సంబంధించిన దృశ్యాల‌ను మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు.