Air India Big Deal : రూ.6లక్షల 40వేల కోట్లు, 470 కొత్త విమానాలు.. ఎయిరిండియా బిగ్ డీల్

ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియాను రెండేళ్ల క్రితం టాటా కొనుగోలు చేసింది. అనంతరం ఎయిరిండియాకు చెందిన పాత విమానాలను పక్కన పెట్టింది.

Air India Big Deal : ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియాను రెండేళ్ల క్రితం టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అనంతరం ఎయిరిండియాకు చెందిన పాత విమానాలను పక్కన పెట్టింది. కొత్త విమానాల కొనుగోలుకు ప్రణాళిక వేసింది.

Also Read..విమానంలో ఏ సీట్లో కూర్చుంటే సేఫ్టీ ఎక్కువంటే..

ఇందులో భాగంగా ఫ్రాన్స్ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాలు, అమెరికా సంస్థ బోయింగ్ నుంచి 220 విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఎయిర్ బస్ నుంచి 40 వైట్ బాడీ-ఏ 350 విమానాలు, 210 నేరో బాడీ-ఏ 320/321 నియో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే ఆల్ఫా విమానాల కోసం వైట్ బాడీ విమానాలను ఉపయోగించనున్నారు. బోయింగ్ నుంచి పెద్ద విమానాలైన 20 బోయింగ్ 787-ఎస్, 10, 777 9ఎస్ తో 737 మ్యాక్స్ విమానాలు 190 కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం చేసుకుంది.

Also Read..Fight Over Window Seat : ఇదేందయ్యా ఇది.. విమానంలో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు, వీడియో వైరల్

ఈ మొత్తం ఆర్డర్ల విలువ 80 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 6లక్షల 40వేల కోట్లు ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి ఎయిరిండియా కొత్త విమానాలు గాల్లోకి ఎగిరే అవకాశముంది. భారతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్ వేస్, ఎతిహార్ ఇతర దేశాల విమానాయన సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎయిరిండియా కొత్త విమానాలు వచ్చాక ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది. ఏ-350 లాంటి వెడల్పైన పరిణామం గల విమానాలు కొనుగోలు చేయడం ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లకు భారత్ కు మధ్యలో నాన్ స్టాప్ విమానాలు నడిపేందుకు వీలవుతుంది.

Also Read..Self-flying planes : పైలట్ అవసరం లేకుండా.. సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు

అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఎయిరిండియా మరింత పుంజుకునే అవకాశం ఉంది. విదేశాల్లో నివసించే ఎక్కువమంది ప్రవాస భారతీయులకు సేవలు అందించేందుకు ఇవి లాభదాయకమైన మార్గాలు. కానీ, గల్ఫ్ విమానాయన సంస్థల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేయడం అంత తేలికైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు భారత్ వచ్చే ఐదేళ్లలో కొత్తగా 80 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత భారత విమానయాన మార్కెట్ వేగంగా కోలుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వార్షికంగా దేశీయ ట్రాఫిక్ 48.9 శాతం పెరిగింది. డిసెంబర్ 2022 లో 12.2 కోట్ల మందికిపైగా భారతీయులు ఇంటర్నల్ ఫ్లైట్స్ లో ప్రయాణాలు చేసినట్లు తాజా డేటా చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు