Fight Over Window Seat : ఇదేందయ్యా ఇది.. విమానంలో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు, వీడియో వైరల్

విండో సీటు కోసం కొట్టుకునేవరకు వెళ్తున్నారు జనాలు. అదీ ఏకంగా విమానంలో. అవును.. ఫ్లైట్ లో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం విస్మయానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Fight Over Window Seat : ఇదేందయ్యా ఇది.. విమానంలో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు, వీడియో వైరల్

Fight Over Window Seat : సాధారణంగా ప్రయాణ సమయాల్లో అది బస్ కావొచ్చు ట్రైన్ కావొచ్చు లేవా కారు కావొచ్చు.. చాలామంది విండో సీటు కోరుకుంటారు. విండో సీటుని కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. విండో నుంచి బయటి దృశ్యాలను చూడొచ్చని కొందరు, గాలి కోసం మరికొందరు విండో సీటుని ఆశిస్తారు.

కొందరు కచ్చితంగా తమకు విండో సీటు కావాలని పోటీపడతారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ, విండో సీటు కోసం కొట్టుకునేవరకు వెళ్తున్నారు జనాలు. అదీ ఏకంగా విమానంలో. అవును.. ఫ్లైట్ లో విండో సీటు కోసం కొట్టుకోవడం విస్మయానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొట్టుకోవడం అంటే అలా ఇలా కాదు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని తన్నుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ లోని గోల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటు చేసుకుంది.

Also Read..Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

వివరాల్లోకి వెళితే.. విమానంలో రెండు కుటుంబాలకు చెందిన 15మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వైకల్యంతో బాధపడుతున్న తన కొడుకు కోసం విండో సీటు ఇవ్వాలని ఓ మహిళ తోటి ప్రయాణికుడిని కోరింది. అందుకు ఆ ప్రయాణికుడు ఒప్పుకోలేదు. విండో సీటు ఇచ్చేది లేదన్నాడు. తన సీటులో తానే కూర్చుంటానని తేల్చి చెప్పాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్తా పెద్దదై ఇరువర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు కుమ్మేసుకున్నారు. దీంతో విమానంలో రచ్చ రచ్చ జరిగింది. ఈ గొడవతో తోటి ప్రయాణికులు షాక్ కి గురయ్యారు. అసలేం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. రంగంలోకి దిగిన సిబ్బంది.. గొడవపడిన ప్రయాణికులను కిందకు దింపేశారు. ఆ తర్వాత విమానం బయలుదేరింది. వీరి గొడవ కారణంగా 2 గంటలు ఆలస్యంగా విమానం బయలుదేరాల్సి వచ్చింది.

Also Read..Wedding Photoshoot : కెమెరామెన్‌ దిమ్మతిరిగిపోయింది.. ఫొటోలకు ఫోజులివ్వమంటే.. ముద్దులతో రెచ్చిపోయిన జంట .. వీడియో వైరల్

కాగా, వీరి మధ్య గొడవ కారణంగా విమానంలోని తోటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఓ మహిళ పరిస్థితి దారుణంగా తయారైంది. వీళ్ల తోపులాటలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆమె తన రొమ్ముకు చేతులు అడ్డుపెట్టుకోవాల్సి వచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విండో సీటు కోసం విమానంలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అమ్మో అంటున్నారు. వీళ్లేం మనుషులు అని అవాక్కవుతున్నారు. ఇది మరీ టూ మచ్ అని కామెంట్ చేస్తున్నారు.