Delhi Air Pollution
Delhi Air Pollution : దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దమ్ము, ధూళి కణాలతో గాలి నిండిపోయింది. విజబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450పైగా నమోదు అవుతోంది.
పంట వ్యర్థాల దహనం, వాహనాల కాలుష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఢిల్లీ ఎన్సీఈర్ పరిధిలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యం ప్రభావంతో కళ్ల మంటలు, కంటి నుంచి నీరు కారడం, గొంతు నొప్పి, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Air Pollution : ఢిల్లీ ఎన్సీఆర్ లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండటంతో జీఆర్ఈపీ 3 నిబంధనలను అమలులోకి తెచ్చారు. డీఎస్3 పెట్రోల్, డీఎస్4 డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధాలు విధించారు. ఢిల్లీలో 13 హాట్ స్పాట్ లను గుర్తించి నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.