Ajay Devgn : కరోనా వేళ..ముంబై కార్పొరేషన్ కు అజయ్ దేవ్ గన్ మద్దతు

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో (బీఎంసీ)తో జత కట్టారు.

Ajay Devgn : కరోనా వేళ..ముంబై కార్పొరేషన్ కు అజయ్ దేవ్ గన్ మద్దతు

Mumbai

Updated On : April 28, 2021 / 10:08 PM IST

BMC : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతన్నాయి. భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. పలు రంగాలు తీరని నష్టాలు చవి చూస్తున్నాయి. మరోవైపు..కరోనా రోగులను ఆదుకొనేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కూడా నేనున్నా అంటూ ముందుకొచ్చారు. ఆయన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో (బీఎంసీ)తో జత కట్టారు. శివాజీ పార్కులో అత్యవసర వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయడానికి తన సంస్థ (NY Foundations) ద్వారా సహకారం అందిస్తున్నారు. ఇక్కడున్న మ్యారేజ్ హాల్స్ కోవిడ్ సెంటర్లు మార్చేశారు. 20 పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

అజయ్ దేవ్ గన్ తో పాటు..ఆనంద్ పండింట్, బోనీ కపూర్, లవ్ రంజన్, రజనీష్ కానుజా, లీనా యాదవ్, అశీమ్ బజాజ్, సమీర్ నయర్, దీపక్ ధర్, రిషీ నేగీ, తరుణ్ రాథి, డైరెక్టర్ ఆర్పీ యాదవ్ లు బీఎంసీ కార్పొరేషన్ డెవలప్ మెంట్ కు స్మైలీ అకౌంట్ ద్వారా..రూ. కోటి అందించారు. అజయ్ దేవ్ గన్ బీఎంసీకి మద్దతు ఇవ్వడం జరిగిందని శివసేన కార్పొరేటర్ విశాక రౌత్ వెల్లడించారు. ఇప్పటికే సోనూ సూద్, తాప్సీ, భూమి పడ్నేకర్ ఇతర ప్రముఖులు ప్రజలకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Delhi : ఢిల్లీలో కరోనా..కుక్కల స్మశాన వాటికలో దహనాలు