ఇంత మోసమా ? అజిత్…..సంజయ్ రౌత్ 

  • Publish Date - November 23, 2019 / 05:51 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై  శివసేన పార్టీ  స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్‌ రౌత్‌  ఘాటుగా విమర్శించారు.  బీజేపీతో కలిసి అజిత్‌ పవార్‌ అధికారం పంచుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యవహారం వెనుక​ శరద్‌ పవార్‌ లేరని నమ్ముతున్నా అన్నారు.  

అజిత్‌ పవార్‌పై ముందు నుంచి అనుమానంగానే ఉందని, ఈడీ కేసులకు భయపడే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపించారు. శుక్రవారం తమతో జరిగిన సమావేశంలోనూ అజిత్‌ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. నిన్ని రాత్రి 9 గంటలవరకు ఆ మహాశయుడు మతోనే ఉన్నాడు అనుకోకుండా మాయమైపోయాడు.  అనంతరం కళ్లలోకి కళ్లుపెట్టి చూడటానికి ఇష్టపడలేదు.  తప్పు చేసిన వాళ్లలాగా తలదించుకుని మాట్లాడారు.  అప్పుడే మాకు అనుమానం వచ్చిందని ఆయన అన్నారు.

శరద్‌ పవార్‌ను అజిత్‌ మోసం చేశారని, దొంగదెబ్బ తీశారని దుయ్యబట్టారు. ఛత్రపతి శివాజీ వారసత్వమున్న మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు. శనివారం ఉదయం ముంబై లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సంజయ్ రౌత్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అజిత్ పవార్ తో పాటు అతనికి మద్ధతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను, మహారాష్ట్రను అవమానపర్చారని సంజయ్ రౌత్ ఆరోపించారు. ధన బలంతో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుందని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో శరద్‌ పవార్‌కు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు.