Ajit Pawar Plane Crash (Image Credit To Original Source)
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం గురించి పలు విషయాలు వెల్లడవుతున్నాయి. విమానంలో ఉండగానే ప్రమాదం తప్పదని 16 నిమిషాల ముందే అందులోని వారికి తెలుసా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8.10 గంటలకు ముంబై నుంచి ఆ విమానం బయలుదేరింది. 15 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది.
ఆ వెంటనే పైలట్ అప్రమత్తమై, 8.30 గంటలకు ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నించారు. కుదరకపోవడంతో 8.42 గంటలకు మరోసారి ప్రయత్నించారు. పరిస్థితి చేజారిపోతుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అంతలోనే విమానం నియంత్రణ కోల్పోయింది. ఆ విమానం బండను ఢీ కొట్టడంతో సరిగ్గా 8.46 గంటలకు విమానం క్రాష్ అయింది. రన్వేకు అతి సమీపంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కెప్టెన్ సుమిత్ కుమార్, కో పైలట్ శాంభవి ఆ విమానాన్ని నడిపారు. పైలట్ సుమిత్ కుమార్ చాలా అనుభవమైన పైలట్. దాదాపు 16 వేల గంటల ఎక్స్‌పీరియన్స్ ఉంది. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కాస్త అనుకూలంగా లేనట్లుగా ఉన్నాయి.
బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. తొలుత ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం ఒక రౌండ్ చక్కర్లు కొట్టింది.
Also Read: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
అయితే, 11వ నెంబర్ రన్వేపై దిగేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ పైలట్ ఆ రన్వే పై ల్యాండ్ అవుతున్న సమయంలో మిస్ అప్రోచ్ అవుతుట్టుగా వీఎస్ఆర్ ఏవియేషన్ చెబుతోంది.
మిస్ అప్రోచ్ కారణంగా రెండోసారి ల్యాండింగ్ సమయంలో సరిగ్గా రన్వేపై దిగడానికి కొద్ది మీటర్ల ముందు దిగువ ప్రాంతంలో అది బండను ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ క్రాష్‌కు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 8.45 గంటల నుంచి 8.46 గంటల మధ్య భారీ శబ్దాలు వినపడ్డాయి. విమానం పేలిపోయింది.
బారామతి విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఉన్నారు.