మహాకూటమి నుంచి కాంగ్రెస్ ఔట్!: అఖిలేష్, మాయా సంచలన నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : January 5, 2019 / 06:55 AM IST
మహాకూటమి నుంచి కాంగ్రెస్ ఔట్!: అఖిలేష్, మాయా సంచలన నిర్ణయం

ఒకరంటే ఒకరికి పడదు. పక్కపక్కనే ఉన్నా పలుకరించుకొనేవాళ్లు కాదు. వాళ్లది దశాబ్దాల వైరం. అయితే మధ్యలో మూడోవ్యక్తి రాకతో వారిద్దరూ అనివార్య పరిస్థితుల్లో చేతులు కలపాల్సి వచ్చింది. ఎంతలా అంటే నువ్వు లేక నేను అన్నట్లుగా. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా?

ఉత్తరప్రదేశ్ లో ఒకప్పటి బద్ధశత్రువులు నేటి మిత్రులు బీఎస్పీ, ఎస్పీ అధ్యక్షులు అఖిలేష్, మాయావతి. బహిరంగా ప్రకటించపోయినప్పటికీ రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ,ఎస్పీలు కలిసి పోటీ చేయనున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ కూటమిగా పోటీ చేసినా బీజేపీని నిలువరించలేకపోయాయి. అంతేకాకుండా కూటమి అడ్రస్ గల్లంతు అవడంతో ఈ సారి మాత్రం కాంగ్రెస్ తో  వెళితే ఎటువంటీ ప్రయోజనం ఉండదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు.

యూపీలో బీజేపీని కట్టడి చేసి మెజారిటీ సీట్లు సాధించి ఢిల్లీలో కింగ్ మేకర్ అవ్వాలని అఖిలేష్, మాయావతి పావులు కదుపుతున్నారు. ఈ సమయంలో శుక్రవారం ఢిల్లీలో అఖిలేష్, మాయావతి సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహాకూటమి విషయమై ఇరువురూ చర్చించుకొన్నారు. అయితే మహాకూటమిలో కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదని ఈ సమావేశంలో అఖిలేష్, మాయావతి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పార్టీలను మాత్రం కూటమిలోకి ఆహ్వానించాలని వీరివురూ నిర్ణయించారు. జనవరి 15 తర్వాత ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నారనే దానిపై ఓ క్లారిటీ రానుంది. వచ్చే వారంలో మరోసారి అఖిలేష్, మాయావతి సమావేశం కానున్నారు. అయితే కూటమి తరపున ఆర్ఎల్డీ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు 73 సీట్లు గెల్చుకొన్నాయి. అయితే ఇటీవల జరిగిన యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.