Mamata Banerjee : నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్..

చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ..

Mamata Banerjee : నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్..

West Bengal CM Mamata Banerjee

NITI Aayog Meeting : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతుంది. అయితే, ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో బెంగాల్ కు కేంద్ర నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా తన మైక్ ను మ్యూట్ చేసినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు.

Also Read : Hyderabad : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నగరంలో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..?

నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని మమత డిమాండ్ చేశారు. చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైంది నేను ఒక్కరినే. నాకు ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు సమయం ఇచ్చారు. నన్ను మాట్లాడనివ్వకపోవడం అవమానకరమని ఆమె అన్నారు. కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందని అన్నారు. ఇదిలాఉంటే.. నీతి ఆయోగ్య పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు ఉన్నారు. వీరితోపాటు పలు రాష్ట్రాల సీఎంలు కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు.

Also Read : బతుకమ్మ చీరలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీ కామెంట్స్.. హరీశ్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

మమత బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. మైక్ కట్ చేశారని మమతా చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. సమావేశంలో మాట్లాడేందుకు ఆమెకు ఇచ్చిన సమయం పూర్తి అయినట్లు గడియారం తెలియ చేసిందని, కనీసం బెల్ కూడా మోగించలేదని కేంద్రం తెలిపింది. వాస్తవానికి అక్షర క్రమంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించటం జరిగింది. ఆ ప్రకారం మమతా బెనర్జీ మధ్యాహ్నం తరువాత మాట్లాడాల్సి ఉంది. కానీ, సాయంత్రమే తొందరగా తిరిగి బెంగాల్ కు వెళ్లాల్సి ఉంది కాబట్టి ముందుగానే మాట్లాడే అవకాశం ఇవ్వాలని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు 7వ స్పీకర్ గా మమత బెనర్జీ కి అవకాశం ఇచ్చామని కేంద్రం తెలిపింది.