బతుకమ్మ చీరలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీ కామెంట్స్.. హరీశ్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి.. ఇప్పుడు..

బతుకమ్మ చీరలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీ కామెంట్స్.. హరీశ్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

CM Revanth Reddy

CM Revanth Reddy Speech In Assembly : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టాలనిచూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు. అసెంబ్లీలో మీకు అధికారం అక్కర్లేదని పక్కకు పెట్టేశారు. అయినా గత అసెంబ్లీలో ఇదేతరహాలో మాట్లాడితే.. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు గుండు సున్నా ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : YS Sharmila : మీకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి జగన్..? షర్మిల సంచలన ట్వీట్

బీఆర్ఎస్ పాలన అవినీతిమయంగా సాగింది. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ బఠానీల మాదిరిగా రూ.7వేల కోట్లకే తెగనమ్మారు. గొర్రెల పథకం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. గొప్ప కార్యక్రమం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నామని చెప్పి సూరత్ వెళ్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలను మభ్యపెట్టారు. ఆడబిడ్డలే ఇవి కట్టుకోవటానికి కూడా పనికిరావంటూ తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. బతుకమ్మ చీరలను వ్యవసాయ పొలాల్లో పిట్టలను బెదిరించటానికి కడుతున్నారని రేవంత్ అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలకు సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను కూడా బీఆర్ఎస్ నేతలు దోపిడీకి వాడుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : కీలక పదవులను పెండింగ్‌లో పెట్టిన రేవంత్‌ ప్రభుత్వం.. కారణం అదేనా?

కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి.. ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారు. మీరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మిర్రో లెక్క తీద్దాం. అప్పుల లెక్కలు చెబుతున్నారు… కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడం లేదని రేవంత్ అన్నారు. పదేళ్లయినా సీఎం హోదాలో కేసీఆర్ పాలమూరుకు చేసిందేం లేదు. 20లక్షల కోట్లకుపైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా.. రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు. కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆరెఎస్ కు గుండు సున్నా ఇచ్చినా.. బీఆర్ఎస్ నేతల బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదని రేవంత్ రెడ్డి సూచించారు. మీరు నిజాయితీ పాలన అందించి ఉంటే.. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు.