Goa polls 2022 : ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ – కేజ్రీవాల్

గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తుందని ప్రజలకు హామీనిచ్చారు. గత 10 సంవత్సరాలు ఇక్కడ మైనింగ్ నిలిపివేయబడిందన్న

Arvind Kejriwal

Arvind Kejriwal : ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం గోవాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరుతారని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో చర్చకు దారి తీస్తున్నాయి. గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరాఖండ్ 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు పార్టీలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాయి. ఈ క్రమంలో…శనివారం కేజ్రీవాల్ మాట్లాడుతూ…బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారు కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని, ఫలితాల అనంతరం కాషాయ పార్టీలో చేరుతారని తెలిపారు.

Read More : Petrol price: రూ.150 దాటనున్న పెట్రోల్ ధర.. కారణం ఇదే!

గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే… ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తుందని ప్రజలకు హామీనిచ్చారు. గత 10 సంవత్సరాలు ఇక్కడ మైనింగ్ నిలిపివేయబడిందన్నారు. వచ్చే మార్చి 10న గోవా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మార్చి 11 నాటికి కాంగ్రెస్ నుంచి అందరూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిపారు. బీజేపీ ఓడిపోవాలని అనుకొనే వారికి తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, కాంగ్రెస్ కు ఓటు వేయవద్దన్నారు. ఆ ఓట్లు బీజేపీకి వెళుతాయని..అలా చేయకుండా ఆప్ కు వేయాలన్నారు.

Read More : Tunnel Collapsed : మధ్యప్రదేశ్ లో కూలిన సొరంగం.. చిక్కుకుపోయిన కార్మికులు

కొండ ప్రాంతాల్లో ఉణ్న అన్ని గ్రామాల్లో ఆరోగ్య, సంరక్షణ సేవలతో పాటు పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాల కోసం వలస వెళుతున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఐదు రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.