Lok Sabha elections-2024: రాజీపడే ధోరణితో చర్చలు జరపాలి: విపక్షాల ఐక్యతపై చిదంబరం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలు, ప్లీనరీ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని విపక్ష పార్టీలు ఐక్యతపై దృష్టిపెట్టాలని, రాజీ పడే ధోరణితో చర్చలు జరపాలని అన్నారు.

Lok Sabha elections-2024: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలు, ప్లీనరీ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని విపక్ష పార్టీలు ఐక్యతపై దృష్టిపెట్టాలని, రాజీ పడే ధోరణితో చర్చలు జరపాలని అన్నారు.

అన్ని పార్టీలూ రాష్ట్ర స్థాయి దృష్టితో కాకుండా జాతీయ స్థాయి దృష్టితో రాజకీయ పరిస్థితులను చూడాలని చిదంబరం చెప్పారు. కాంగ్రెస్ నేతలతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి నేతలు కొత్త దృష్టి కోణంతో లోక్ సభ ఎన్నికల గురించి ఆలోచించాలని అన్నారు.

ఏఐసీసీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ ఎన్నికలు జరగాలని, ఆ కమిటీలో యువ నేతలనూ చేర్చాలని చిదంబరం అన్నారు. సీడబ్ల్యూసీని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ విషయంలో సమస్యలు ఉన్నాయని తనకు తెలిసిందని చెప్పారు. దీన్ని పార్టీ పోల్ ప్యానెల్ వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు.

సీడబ్ల్యూసీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంపై స్పందిస్తూ.. తనకు ప్రత్యేకంగా ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు, అంచనాలు లేవని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24 నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ వివరాలు తెలపనుంది.

RBI 25 Lakhs Lucky Draw : ఆర్బీఐ లక్కీ డ్రా.. గెలిస్తే రూ.25లక్షలు..! కేంద్రం క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు