RBI 25 Lakhs Lucky Draw : ఆర్బీఐ లక్కీ డ్రా.. గెలిస్తే రూ.25లక్షలు..! కేంద్రం క్లారిటీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా పేరుతో టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఆర్బీఐ లక్కీ డ్రా లో గెలిస్తే రూ.25లక్షలు మీ సొంతం అనే ఓ మేసేజ్ వైరల్ గా మారింది. ఇది నిజమేనేమో అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ మేసేజ్ కనుక క్లిక్ చేసి మన వివరాలు సమర్పిస్తే అంతే, మన వ్యక్తిగత వివరాలన్నీ మోసగాళ్ల చేతికి చిక్కుతాయి.

RBI 25 Lakhs Lucky Draw : ఆర్బీఐ లక్కీ డ్రా.. గెలిస్తే రూ.25లక్షలు..! కేంద్రం క్లారిటీ

RBI 25 Lakhs Lucky Draw : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ లింక్స్ తో బ్యాంకు ఖాతాలు దోచేస్తున్నారు. ఊరించే ప్రకటనలతో బురిడీ కొట్టిస్తున్నారు.

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా పేరుతో టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఆర్బీఐ లక్కీ డ్రా లో గెలిస్తే రూ.25లక్షలు మీ సొంతం అనే ఓ మేసేజ్ వైరల్ గా మారింది. ఇది నిజమేనేమో అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ మేసేజ్ కనుక క్లిక్ చేసి మన వివరాలు సమర్పిస్తే అంతే, మన వ్యక్తిగత వివరాలన్నీ మోసగాళ్ల చేతికి చిక్కుతాయి. ఆ తర్వాత ఎంతటి ఘోరం జరుగుతుందో చెప్పక్కర్లేదు. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి లింక్స్, మేసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Also Read..Free Laptops To Students : విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్ ఇస్తున్న భారత ప్రభుత్వం..! కేంద్రం క్లారిటీ

సైబర్ నేరగాళ్లు.. ప్రజలను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడతో వచ్చారు. ఈసారి ఏకంగా ఆర్బీఐనే వాడుకున్నారు. ఆర్బీఐ లక్కీ డ్రా తీస్తోందని, రూ.25లక్షలు గెలుచుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ మేసేజ్ వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో(PIBFactCheck) ఫ్యాక్ట్ చెక్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించింది.

ఆర్బీఐ లక్కీ డ్రా మేసేజ్ ఫేక్ అని తెలిపింది. అందులో నిజం లేదంది. అదో పెద్ద స్కామ్ అని చెప్పింది. ఆర్బీఐతో ఎలాంటి సంబంధం లేదంది. అసలు, లాటరీ ఫండ్స్ అంటూ ఆర్బీఐ ఎలాంటి మేసేజ్ లు కానీ ఈ-మెయిల్స్ కానీ పంపదని తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొరపాటున కానీ అలాంటి లింక్ ల జోలికి వెళ్లదని చెప్పింది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని కేంద్ర సంస్థ హెచ్చరించింది.

Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

కాగా, దేశంలోని విద్యార్థులందరికీ భారత ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్స్ ఇస్తోందని ఇటీవలే సైబర్ క్రిమినల్స్ ఓ ఫేక్ మేసేజ్ తో మోసానికి తెరలేపారు. వెంటనే అలర్ట్ అయిన PIB Fact Check.. అందులో నిజం లేదని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.