క్వారంటైన్ లో ఉన్నోళ్లు గంటకో సెల్ఫీ పంపాలి…కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే ఈ సమయంలో హోం క్వారంటైన్ లో ఉన్న చాలామంది అప్పుడు బయట తిరుగుతున్నట్లు సమాచరమందటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ లో ఉన్న వారందరూ గంటకు ఒకసారి తమ సెల్ఫీ తీసి ప్రభుత్వానికి పంపించాలని యడియూరప్ప సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7గంటల నుంచి రాత్రి 10గంటల వరకు గంటకొకసారి సెల్ఫీ తీసి ప్రభుత్వానికి వాళ్లు పంపించాలని ఆదేశించింది.
సెల్ఫీలో వ్యక్తుల లొకేషన్ సంబంధించిన వివరాలు కూడా జత చేయాలని సూచించింది. ఈ వివరాలన్నిటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో వెరిఫికేషన్ టీం సునిశితంగా పరిశీలిస్తుందని తెలిపింది. తమ చిత్రాలు కాకుండా తప్పడు సెల్ఫీలు పంపించిన లేదా గంటకొకసారి సెల్ఫీ తిసి పంపించకపోయినా..వాళ్ల దగ్గరకు ప్రభుత్వ అధికారులు వెళ్లి వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ శిబిరాలకు తరలిస్తామని కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ కే సుధాకర్ సోమవారం(మార్చి-30,2020)జారీ చేసిన ప్రెస్ రిలీజ్ లో తెలిపారు.
కర్ఱాటకకు విదేశాల నుంచి వచ్చినవారు మరియు కరోనా సోకిన వ్యక్తిని కలిసిన వారు తమ తమ ఇళ్లల్లో క్వారంటైన్(నిర్భందం) అయ్యారు. కర్ణాటకలో 23వేల 152మందికి క్వారంటైన్ డీటెయిల్స్ తో స్టాంప్ వేశారు. అంతేకాకుండా క్వారంటైన్ లో ఉన్న వాళ్ల ఇళ్లకు వాలంటీర్ టీమ్ లు కూడా వెళ్లి…క్వారంటైన్ లో ఉన్న వాళ్ల ఫొటోలు తీసి ప్రభుత్వానికి పంపనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ వాచ్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను షేర్ చేసిండి. రాష్ట్రంలో క్వారంటైన్ లో ఉన్నవాళ్లు ఈ లింక్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది.