Amarnath Yathra
Samapan Pooja: 2021 సంవత్సరానికి సంబంధించి అమర్‌నాథ్ యాత్ర ఎట్టకేలకు ముగిసింది. సహజ సిద్ధంగా అమర్‌నాథ్ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు. 56 రోజులపాటు సాగిన సుప్రసిద్ధ యాత్రలో చారీ ముబారక్ ఈశ్వరుడి చెంతకు చేరుకోవడం వల్ల ఆలయ అధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు.
శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో యాత్ర ముగియగా.. హిమలింగ రూపంలో గుహలో కొలువైన ఈశ్వరుడి చెంతకు చారీ ముబారక్ చేరుకోవడం వల్ల ఆలయాధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు. జూన్ 28వ తేదీన సంప్రదాయబద్దంగా యాత్రను ప్రారంభించిన శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు.. ఆనవాయితీగా వస్తున్న ఆచారాల్ని, క్రతవుల్ని పాటిస్తూ రక్షాబంధన్ రోజున సంప్రదాయంగా పూజ కార్యక్రమాల్ని ముగించింది.
కరోనా కారణంగా సామాన్య భక్తుల యాత్రకు అవకాశం లేకపోవటంతో టీవీ ఛానెల్‌లు, సామాజిక మాధ్యమాల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యక్ష ప్రసారాలను శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పాటు చేసింది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసింది.