Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసింది. అమెజాన్ కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ డే సేల్ డేట్ ప్రకటించింది కంపెనీ.

Amazon India Announces Prime Day Sale Date
Amazon Prime Day Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసింది. అమెజాన్ కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ డే సేల్ డేట్ ప్రకటించింది కంపెనీ. కొత్త స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీలు సహా ఇతర అన్ని డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. అమెజాన్ ఇండియా జూలై 23 నుంచి జూలై 24 మధ్య అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ధృవీకరించింది. స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, అప్లియన్సెన్, ఫ్యాషన్ & బ్యూటీ, కిరాణా సామాగ్రి, అమెజాన్ డివైజ్‌లు, హోం & కిచెన్, రోజువారీ అవసరాల కోసం ఫర్నిచర్ మరిన్నింటిపై అమెజాన్ టన్నుల కొద్దీ డీల్‌లను అందిస్తోంది.
ప్రైమ్ డే సేల్ ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంటుందని గమనించాలి. కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించేందుకు అమెజాన్ ప్రతి ఏడాదిలో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్ అందించడమే కాకుండా.. ప్రైమ్ డే మెంబర్స్ ప్రత్యేక డిస్కౌంట్లు, స్పీడ్ డెలివరీ, ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్రైమ్ డే సేల్ గురించి అమెజాన్ ఇండియా డైరెక్టర్ – ప్రైమ్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అక్షయ్ సాహి మాట్లాడుతూ.. భారత్‌లో మా ఆరవ ప్రైమ్ డే సేల్ అతిపెద్దదిగా పేర్కొన్నారు. మా ప్రైమ్ మెంబర్‌లందరిని ఆకర్షించే షాపింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కనువిందు చేయనుంది. ఈ ప్రైమ్ డే సందర్భంగా బెస్ట్ డీల్‌లు, కొత్త లాంచ్‌లు, బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందవచ్చునని విశ్వసిస్తున్నానని చెప్పారు. మా ప్రైమ్ ఫ్యామిలీకి కొత్త కస్టమర్‌లకు సర్వీసు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సాహి తెలిపారు.

Amazon India Announces Prime Day Sale Date
అమెజాన్ ప్రైమ్ డే సేల్ :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 23 ఉదయం 12:00 గంటలకు ప్రారంభమై జూలై 24 రాత్రి 11:59 వరకు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా.. Samsung, Xiaomi, boAt, Intel, Lenovo, Sony, Bajaj, Eureka Forbes, Puma, Adidas, USPA, Max వంటి టాప్ ఇండియన్ & గ్లోబల్ బ్రాండ్‌ల నుంచి 400కి పైగా టాప్ బ్రాండ్‌ల నుంచి 30వేల కన్నా ఎక్కువ కొత్త ప్రొడక్టుల లాంచ్ కానున్నాయి. Asics, Fastrack, Tresemme, Mamaearth, Surf Excel, Dabur, Colgate, Whirlpool, IFB మరిన్ని భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మొదటి నుంచి ప్రైమ్ మెంబర్లకు ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, యూజర్ ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్, టీవీలు, కిచెన్, రోజువారీగా అద్భుతమైన డీల్స్ ఆకట్టుకునేలా ఉండనున్నాయి. అవసరమైన వస్తువులు, బొమ్మలు, ఫ్యాషన్, బ్యూటీ ఇల మరెన్నో ప్రొడక్టులను అమెజాన్ ఈ ప్రైమ్ డేలో పొందవచ్చు. Amazon Echo, Fire TV Kindles డివైజ్‌లపై ప్రత్యేకమైన డీల్‌లను అమెజాన్ అందించనుంది. స్మార్ట్ స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, ఫైర్ టీవీ ప్రొడక్టులపై 55 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది.
Read Also : Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!