America Key Decision : అమెరికాకు నో ఎంట్రీ.. భారత్ పై ట్రావెల్ బ్యాన్

భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది.

America Key Decision : అమెరికాకు నో ఎంట్రీ.. భారత్ పై ట్రావెల్ బ్యాన్

America Imposes Travel Ban On India

Updated On : May 1, 2021 / 8:50 AM IST

america travel ban on India : భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది. మే 4 నుంచి అమెరికాకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌట్‌ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. భారత్ లో కరోనా తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సలహా మేరకు భారత్‌ నుంచి నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌సాకి తెలిపారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్‌లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు.

భారత్‌లో కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బహుళ వేరియంట్లతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ (సీడీసీ) నిర్ధారించింది. బీ.1.617 వైరస్‌ వేరియంట్‌ భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమని సీడీసీ భావిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు చురుకైన చర్యలు అవసరమని సీడీసీ తేల్చినట్లు ప్రెస్‌ సెక్రెటరీ పేర్కొన్నారు.

అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డు దారులు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.