Naveen Modi
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీని కలవనున్నారు. జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉండడం, అలాగే, ఒడిశాలో నాలుగు రాజ్యసభ సీట్లకూ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ మోదీని నవీన్ పట్నాయక్ కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నవీన్ పట్నాయక్ ఢిల్లీకి బయలుదేరారు.
north korea: కఠిన ఆంక్షల నుంచి ఉత్తరకొరియా ప్రజలకు త్వరలోనే ఉపశమనం
ఈ పర్యటనలో భాగంగా మోదీని ఆయన కలుస్తారని ఒడిశా అధికారులు తెలిపారు. మోదీతో పట్నాయక్ జరిపే చర్చల్లో రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా ఉందని చెప్పారు. పట్నాయక్ ఢిల్లీలో పర్యటిస్తుండం 30 రోజుల్లో ఇది రెండో సారి. ఏప్రిల్ 29 నుంచి ఆయన ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది.
Jagdeep Dhankhar: మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌పై చర్యలు తీసుకోండి: గవర్నర్ ఆదేశాలు
పట్నాయక్‌కు చెందిన బీజేడీ యూపీఏ, ఎన్డీఏకి దూరంగా ఉంటోంది. అయితే, గత రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం రామ్‌నాథ్ కోవింద్‌కు బీజేడీ మద్దతు తెలిపింది. అకాలీ దళ్, శివసేన ఇప్పుడు బీజేపీకి మద్దతుగా లేకపోవడంతో బీజేడీ మద్దతు కోసం ఎన్డీఏ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. బీజేడీకి లోక్‌సభలో 12 మంది, రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అలాగే, ఒడిశా అసెంబ్లీలో 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.