Jagdeep Dhankhar: మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్‌పై చ‌ర్య‌లు తీసుకోండి: గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికృష్ణ ద్వివేదిని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జగదీప్ ధన్‌క‌ర్ ఆదేశించారు.

Jagdeep Dhankhar: మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్‌పై చ‌ర్య‌లు తీసుకోండి: గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు

Jagdeep

Jagdeep Dhankhar: ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికృష్ణ ద్వివేదిని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జగదీప్ ధన్‌క‌ర్ ఆదేశించారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఉన్న కొంద‌రు ప్ర‌తి కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) విచార‌ణకు అప్ప‌చెబుతూ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని అభిషేక్ బెన‌ర్జీ తాజాగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

UN report: అఫ్గాన్‌లో పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ శిక్ష‌ణ శిబిరాలు.. భార‌త్‌పై కుట్ర‌లు?

దీనిపై గ‌వ‌ర్న‌ర్ జగదీప్ ధన్‌క‌ర్ సోమ‌వారం స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని, ఇటువంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌వ‌ద్ద‌ని చెప్పారు. అభిషేక్ బెన‌ర్జీపై చ‌ర్య‌లు తీసుకుని, దీనిపై జూన్ 6లోపు సీఎస్‌తో పాటు సీపీ త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు. అభిషేక్ ప్ర‌ద‌ర్శించిన‌ తీరు న్యాయ‌వ్య‌వ‌స్థ ప్ర‌క్రియ‌, ప‌ద్ధతుల్లో జోక్యం చేసుకోవ‌డ‌మే అవుతుంద‌ని చెప్పారు.

Shivraj Chouhan: అభివృద్ధిలో హైద‌రాబాద్‌ను ఇండోర్ అధిగ‌మిస్తుంది: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రజాస్వామ్యంపై దాడి చేయ‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. కాగా, అభిషేక్ బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆదివారం కూడా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ మండిప‌డ్డారు. అభిషేక్ బెన‌ర్జీ హ‌ద్దులుదాటి మాట్లాడార‌ని ఆయ‌న అన్నారు. అయితే, అభిషేక్ బెన‌ర్జీ మాత్రం త‌న వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు.

Kamal Nath: నేను హిందువున‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాను, కానీ..: క‌మ‌ల్‌నాథ్

కాగా, ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన స్కూల్ స‌ర్వీస్ క‌మిష‌న్ స్కామ్‌తో పాటు ప‌లు కేసుల‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తూ కల‌క‌త్తా హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. కొన్ని నెల‌ల ప‌రిధిలోనే ప‌లు కేసుల‌ను సీబీఐకి అప్ప‌గించింది. స్కూల్ స‌ర్వీస్ క‌మిష‌న్ స్కామ్ కేసులో సీబీఐ విచార‌ణ‌కు ఇటీవ‌లే ప‌శ్చిమ బెంగాల్ మంత్రి ఒకరు హాజ‌ర‌య్యారు.