Union Home Minister Amit Shah participates in the cleanliness drive
Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ ఓ గుడిని శుభ్రం చేశారు. గుడి ఆవరణను నిటితో కడిగారు. జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా మందిరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
స్వచ్ఛ తీర్థ్‌లో భాగంగా ఇవాళ అమిత్ షా అసోంలోని తేజ్‌పూర్ మహాభైరబ్ ఆలయాన్ని సందర్శించి, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని హనుమాన్ సేతు మందిరాన్ని శుభ్రం చేశారు.
RajaSingh
అలాగే, తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా గోషా మహల్‌లో హనుమాన్ గుడిని శుభ్రం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనకదుర్గ గుడిలో స్వచ్ఛ తీర్థ్‌లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా కరీంనగర్ , పద్మనగర్ రామాలయ ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు.
#WATCH | Union Home Minister Amit Shah participates in the cleanliness drive at the Mahabhairab Temple in Tezpur, Assam pic.twitter.com/zPMTbl3YMU
— ANI (@ANI) January 19, 2024
దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు, రాజధానిలో కోట కట్టుకున్నారు- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్