Amit Shah
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో కొందరు రాజకీయ నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఓ తెగకు చెందిన ఆరుగురి మృతదేహాలు కనపడడంతో హింస చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి వచ్చిన వెంటనే అమిత్ షా సమావేశాన్ని నిర్వహించారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను సమీక్షించడంపై ఈ సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
అలాగే, రేపు కూడా హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో మరో సమావేశం జరగనుంది. భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య కూడా ఘర్షణలు తలెత్తుతుండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మణిపూర్‌లో మైతేయీ-కుకీ తెగల మధ్య 18 నెలలుగా తరుచూ అల్లర్లు జరుగుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.
Viral Video: అందమైన సిటీలో చెత్త కుప్పలు ఎలా పేరుకుపోయాయో చూడండి..