Viral Video: అందమైన సిటీలో చెత్త కుప్పలు ఎలా పేరుకుపోయాయో చూడండి..

వేలకు వేల రూపాయల జీతాలు తీసుకుంటూ పని చేయడంలో మాత్రం ఇంత అసమర్థంగా ఉంటారా? అని కొందరు ప్రశ్నించారు.

Viral Video: అందమైన సిటీలో చెత్త కుప్పలు ఎలా పేరుకుపోయాయో చూడండి..

Updated On : November 17, 2024 / 7:36 PM IST

బెంగళూరు పేరు చెప్పగానే అభివృద్ధి చెందిన నగరం, ఐటీ సంస్థలు, అక్కడి పచ్చని ప్రకృతి గుర్తుకువస్తాయి. ఈ సిటీని గార్డెన్ సిటీ అని కూడా అనేవారు. అయితే, తాజాగా, బెంగళూరులోని ఎంఎస్‌ పాల్య ప్రాంతం చెత్త కుప్పలతో కనపడడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చెత్త కుప్పలకు సంబంధించిన వీడియోను కర్ణాటక కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. “పచ్చదనం, పరిశుభ్రమైన పర్యావరణంతో ఒకప్పుడు బెంగళూరును గర్వంగా “గార్డెన్ సిటీ” అని పిలిచేవారు.

ఇప్పుడు దురదృష్టవశాత్తు చెత్త నిర్వహణ పద్ధతులు బాగోలేక, బృహత్ బెంగళూరు మహానగర పాలిక అసమర్థత కారణంగా “గార్బేజ్ సిటీ” గా మారుతోంది” అని అందులో పేర్కొన్నారు. దీంతో అధికారుల పనీతిరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వేలకు వేల రూపాయల జీతాలు తీసుకుంటూ పని చేయడంలో మాత్రం ఇంత అసమర్థంగా ఉంటారా? అని కొందరు ప్రశ్నించారు. ఇంత చెత్త పేరుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మరికొందరు విమర్శలు గుప్పించారు.

చలి చంపేస్తోంది..! దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవత్ర, వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..