Anand Mahindra: ఆనంద్ మహేంద్రా సార్..‘నేను అమ్మాయిని’ కాదు..
మెరుపు వేగంతో ‘కలరిపయట్టు’ యుద్ధ కళను ప్రాక్టీస్ చేస్తున్న ఓ బాలిక వీడియోను ఆనంద్ మహేంద్రా షేర్ చేయగా..నేను అమ్మాయిని కాదు సార్ అంటూ ఓ సమాధానం వచ్చింది. అసలు విషయం ఏమిటంటే..

Anand Mahendra (1)
Anand Mahendra who mistaken :పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఫన్నీ వీడియోలు, స్పూర్తినిచ్చే పోస్టులతో నెటిజనులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఆనందపరుస్తుంటారు. ఈ క్రమంలో మరో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోలో ఓ బాలిక పురాతన యుద్ధ విద్య ‘కలరిపయట్టు’.ను అత్యద్భుతంగా ప్రదర్శిస్తోంది. మెరుపు వేగంతో కర్రను తిప్పుతోంది. ఈ తిప్పే విధానం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఈ వీడియోను ఆనంద్ మమేంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ..ప్రజల్ని హెచ్చరిస్తూ.. ‘హెచ్చరిక ఈ యువతి దారిలోకి రాకండి. క్రీడా రంగంలో కలరిపయట్టుకు మరింత ప్రాధాన్యత అందించాలి. అప్పుడే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించలదు అని పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ బాలికను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా ప్రశంసించటం చాలా సంతోషమే. కానీ ఇక్కడో చిన్న మిస్టేక్. అఫ్ కోర్స్ ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా సరే అలాగే అనుకుంటారనుకోండీ..ఇంతకీ ఆ మిస్టేక్ ఏమంటే..
ఆ వీడియోలో కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తున్నది బాలిక కాదు.బాలుడు.ఈ విషయంలో ఆనంద్ మహేంద్రా కూడా పొరపడ్డారు. ఆనంద్ మహేంద్రా పోస్టుపై ఆ బాలుడు స్పందించాడు. తాను బాలికను కాదు బాలుడిని అని తెలిపాడు. ‘ఆనంద్ సర్ ‘మీ మద్దతు, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు..కానీ ఒక చిన్న దిద్దుబాటు.. నేను అమ్మాయిని కాదు, 10ఏళ్ల అబ్బాయిని అంటూ తెలిపాడు ‘నీలకందన్’.
కలరిపయట్టు విద్యలో ఒక షార్ట్ మూవీలో నటించడం కోసం నా జుట్టు పొడవుగా పెంచుతున్నాను’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా కలరిపయట్టు ఆధునిక కేరళలో ఒక పురాతన యుద్ధ కళారూపం. కళరిపయట్టు దీనినే కలరి అని కూడా పిలుస్తారు. కర్రలు, కత్తులు, కవచాలను ఉపయోగించి చేసే ఈ యుద్ధ విద్య భారత్‌లో ఇప్పటికీ ఎంతోమంది ఈ విద్య నేర్చుకుంటున్న పురాతన మార్షల్ ఆర్ట్.
కలరిపయట్టు అంటే..
కాగా..మలయాళంలో కళరి అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం, వ్యాయామం, లేదా కఠిన శ్రమతో కూడిన పని అర్థం. కళరిపయట్టు అనే పదం ఈ రెండు పదాల కలయిక వల్ల ఉద్భవించింది.పరశురాముడు ఈ యుద్ధక్రీడకు ఆధ్యుడిగా భావిస్తారు. కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్ధతులను కచ్చితంగా పాటించాలి.
మంత్ర శాస్త్రము, తంత్ర శాస్త్రము, మర్మ శాస్త్రము మొదలైన వాటిని కలరిలో శక్తులను బ్యాలన్స్ చెయ్యడానికి వాడతారు. భారతదేశంలోని ఇతర కళలాగానే ఇది కూడా మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడుతుంది అని అంటారు.
కొంతకాలం పాటు మరుగున పడ్డ ఈ కళ 1920 వ దశకంలో కేరళలోని తలస్సేరిలో పురాతన విద్యలను మరల వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రాచుర్యం పొందింది. అప్పుడే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కూడా యుద్ధవిద్యలపై మక్కువ పెరగడంతో 1970 వరకు ఈ కృషి సాగుతూ వచ్చింది.
WARNING: Do NOT get in this young woman’s way! And Kalaripayattu needs to be given a significantly greater share of the limelight in our sporting priorities. This can—and will— catch the world’s attention. pic.twitter.com/OJmJqxKhdN
— anand mahindra (@anandmahindra) August 26, 2021