Anand Mahindra: రూ.600 ఖర్చుతో 1,600 కి.మీ ప్రయాణం చేయొచ్చు.. మెచ్చుకోకుండా ఉండలేకపోయిన ఆనంద్‌ మహీంద్ర

దీని ద్వారా సులభంగా ప్రయాణించడంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

ఐఐటీ మద్రాస్ సాయంతో స్టార్టప్ కంపెనీ “వాటర్ ఫ్లై టెక్నాలజీస్” సముద్రంలో నీటిపై ఎగురుతూ అతి వేగంగా ప్రయాణించే విగ్‌ క్రాఫ్టును అభివృద్ధి చేసింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసల జల్లు కురిపించారు.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలాగే ఐఐటీ మద్రాస్ స్టార్టప్‌లకు పెద్ద కేంద్రంగా మారుతోందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ సంస్థ స్టార్టప్‌లకు మంచి మద్దతు, వనరులు, కొత్త బిజినెస్‌, వినూత్న ఆలోచనల విషయంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పుతోందని చెప్పారు.

Also Read: ఐపీఎల్‌ ముందు షాక్‌.. అధికారికంగా రిటైర్‌మెంట్‌ ప్రకటించనున్న ఎమ్మెస్‌ ధోనీ? అతడి షర్ట్‌పై ఉన్న కోడ్‌కి అర్థం ఇదే..

దాదాపు ప్రతి వారానికి ఓ సారి కొత్త ‘టెక్‌వెంచర్’ వార్తలు వస్తున్నాయని చెప్పారు. దీన్ని తాను ఇష్టపడడానికి గల కారణాలను కూడా ఆయన చెప్పారు. ఈ విగ్‌ క్రాఫ్ట్ నదులు, సముద్రాలపై అద్భుతంగా ప్రయాణిస్తుందని, అంతేగాక పడవ/ఓడలాంటి దీని డిజైన్‌ చాలా బాగుందని అన్నారు. ఈ డిజైన్‌ ఇటువంటి రంగాన్ని ఏలుతుందని కితాబు ఇచ్చారు.

కాగా, ఈ విగ్‌ క్రాఫ్టును అభివృద్ధి చేసిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీని ద్వారా సులభంగా ప్రయాణించడంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ప్రయాణానికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

విగ్‌ క్రాఫ్ట్‌లో కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం రూ.600తో ప్రయాణించవచ్చు. ఆ రెండు నగరాల మధ్య 1600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ విగ్‌ కారు సముద్ర ఉపరితలానికి 4 మీటర్ల ఎత్తులో నుంచి ఎగురుతూ దూసుకెళ్లుంది.