అంబాసిడర్ కారు గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా..

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తు నెటిజన్లను ఆలోచింపజేస్తుంటారు.

అంబాసిడర్ కారు గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా..

anand mahindra

Anand Mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తు నెటిజన్లను ఆలోచింపజేస్తుంటారు. కొత్తకొత్త పరికరాలతోపాటు పలు రంగాల్లో కష్టపడి పైకొచ్చిన వారిని అభినందిస్తూ.. వారికి బహుమతులు అందిస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు.

Also Read : బాబోయ్.. వీడు మనిషేనా? ఈ వీడియోను చూస్తే మీకూ కోపమొస్తుంది..

ఆనంద్ మహీంద్రా.. స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేశారు. ఈరోజు బోస్ ప్రతాప్ నుంచి చక్కని బహుమతిని అందుకున్నా. నా పాత జ్ఞాపకాల నుంచి అంబాసిడర్ ఎప్పటికీ మసకబారదు. భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. ఇటువంటి స్థాయి నమూనాల ద్వారా అమరత్వం పొందేందుకు అంబాసిడర్ అర్హమైనది. విశాల్ బింద్రేకి అభినందనలు.. ఎందుకంటే? చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దీనిని దిగుమతి చేసుకున్నందుకు అని ఆనంద్ మహీంద్ర అన్నారు.

Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టెంపో ట్రావెలర్.. 14 మంది దుర్మరణం

ఈ ట్వీట్ చివరిలో ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ కు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.